AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oral Hygiene: నోటి ఆరోగ్యాన్ని పెంచే ఈ మౌత్‌వాష్‌లను ఇంట్లోనే తయారు చేయండి!

నోటి శుభ్రత చాలా అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అది వెంటనే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నోటి శుభ్రతలో ఏ మాత్రం అలసత్వం వహించకండి. నోటిని శుభ్రంగా ఉంచుకుంటే.. బ్యాక్టీరియా, క్రిములు శరీరం లోపలికి వెళ్లకుండా ఉంటాయి. దీంతో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా.. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ఒక్కోసారి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసనను దూరం చేసుకోవడానికి మౌత్ వాష్‌లను కొంటూ ఉంటారు. రసాయనాలు కలిపిన మౌత్ వాష్‌ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఇంట్లోనే..

Oral Hygiene: నోటి ఆరోగ్యాన్ని పెంచే ఈ మౌత్‌వాష్‌లను ఇంట్లోనే తయారు చేయండి!
Oral Hygiene
Chinni Enni
|

Updated on: Jan 11, 2024 | 5:23 PM

Share

నోటి శుభ్రత చాలా అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అది వెంటనే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నోటి శుభ్రతలో ఏ మాత్రం అలసత్వం వహించకండి. నోటిని శుభ్రంగా ఉంచుకుంటే.. బ్యాక్టీరియా, క్రిములు శరీరం లోపలికి వెళ్లకుండా ఉంటాయి. దీంతో అనారోగ్య సమస్యలు దరి చేరకుండా.. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ఒక్కోసారి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసనను దూరం చేసుకోవడానికి మౌత్ వాష్‌లను కొంటూ ఉంటారు. రసాయనాలు కలిపిన మౌత్ వాష్‌ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఇంట్లోనే చక్కగా.. నేచురల్‌గా మౌత్‌ వాష్‌లు తయారు చేసుకోవచ్చు. మీ డబ్బు ఆదా అవడంతో పాటు.. మీ దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఇంట్లోనే మౌత్ వాష్‌లు ఎలా తయారు చేస్తారో చూద్దాం.

పసుపుతో..

పసుపులో యాంటీ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. అందుకే ప్రతి వంటలో కూడా పసుపును యూజ్ చేస్తూ ఉంటారు. దీనితో మౌత్ వాష్‌కూడా తయారు చేయవచ్చు. నోటి పూత, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు పసుపు మౌత్ వాష్ ఉపయోగిస్తే ఆ సమస్యలు దూరం అవుతాయి. నాలుగు లవంగాను కప్పు నీటిలో నానబెట్టాలి. ఇందులో కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయాలి. మౌత్ వాష్ సిద్ధం. ఇలా తయారైన మౌత్ వాష్‌ను బాగా పుక్కిలించి.. ఉమ్మేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే సమస్య దూరం అవుతుంది.

సాల్ట్ వాటర్‌తో..

ఒక్కోసారి పంటి నొప్పి చాలా బాధిస్తుంది. ఏం చేయాలో తెలీదు. అలాంటి సమయంలో సాల్ట్ వాటర్‌ను బాగా పుక్కిలిస్తే.. ఈ సమస్య దూరం అవుతుంది. అదే విధంగా చిగుళ్ల వాపును కూడా తగ్గుతుంది. పంటి నొప్పి ఉన్నా లేకున్నా.. అప్పుడప్పుడు సాల్ట్ వాటర్‌తో ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

యాపిల్ సైడర్ వెనిగర్‌తో..

యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా నోటి ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయ పడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. అదే విధంగా నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి పుక్కిలిస్తే సరిపోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే