AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Increase Drinks: ఈ డ్రింక్స్ తాగితే ఖచ్చితంగా అందం రెట్టింపు అవుతుంది!

మహిళలు అందంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందంగా కనిపించాలని తెగ ప్రయాస పడుతూంటారు. అలాగే మార్కెట్లో ఉండే ప్రోడెక్ట్స్ అన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్స్‌కి కూడా క్యూ కడుతూ ఉంటారు. డబ్బు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. దీని వల్ల చర్మ సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. కానీ సరైన ఆహారం తీసుకుంటే కేవలం అందం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. ఎన్ని పనులు ఉన్నా ప్రతి రోజూ కనీసం కొద్ది..

Beauty Increase Drinks: ఈ డ్రింక్స్ తాగితే ఖచ్చితంగా అందం రెట్టింపు అవుతుంది!
Skin Care
Chinni Enni
|

Updated on: Jan 11, 2024 | 5:23 PM

Share

మహిళలు అందంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందంగా కనిపించాలని తెగ ప్రయాస పడుతూంటారు. అలాగే మార్కెట్లో ఉండే ప్రోడెక్ట్స్ అన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్స్‌కి కూడా క్యూ కడుతూ ఉంటారు. డబ్బు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. దీని వల్ల చర్మ సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. కానీ సరైన ఆహారం తీసుకుంటే కేవలం అందం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. ఎన్ని పనులు ఉన్నా ప్రతి రోజూ కనీసం కొద్ది సమయం అయినా మీ అందం కోసం కేటాయించండి. మనం తినే ఆహారంతోనే మనం అందంగా కనిపించవచ్చు. ఈ జ్యూస్‌లు మీకు తప్పకుండ హెల్ప్ చేస్తాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.

టమాటా – కీర దోశ జ్యూస్:

టమాటా – కీర దోశ జ్యూస్ తాగితే చాలా మంచిది. కేవలం చర్మానికే కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ జ్యూస్ తాగితే విటమిన్లు ఎ, సి వంటివి లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్ ఉదయం తాగితేనే మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ జ్యూస్ తాగితే చర్మం హైడ్రేట్ అవుతుంది. చలి కాలంలో తాగితే పొడి బారకుండా.. కాంతి వంతంగా కనిపిస్తుంది.

ఆరెంజ్ లేదా బత్తాయి జ్యూస్:

ఆరెంజ్ లేదా బత్తాయి జ్యూస్ చర్మానికి చాలా మంచి చేస్తుంది. అయితే ఆరెంజ్ జ్యూస్ ఉదయం కాకుండా సాయంత్రం తాగాలి. ఉదయం తాగితే గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి మెండుగా లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరెంజ్ జ్యూస్ తాగితే చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. డల్ నెస్, పొడి బారడం వంటి సమస్యలు దూరం అవుతాయి. కేవలం చర్మ సమస్యలే కాకుండా జుట్టు, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో పలు రోగాలు దరి చేరకుండా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. కాలం ఏదైనా సరే నీరు తాగడం చాలా ముఖ్యం. దీని వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. దీంతో చర్మంపై ఉండే డల్ నెస్ దూరమై కాంతి వంతంగా కనిపిస్తుంది. అదే విధంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!