Pregnancy: గర్భధారణ సమయంలో కొలెస్ట్రాల్ పెరిగితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదమా?

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ముందుగా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మహిళలు అలసట నుంచి ఛాతీ నొప్పి వరకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. కొంతమంది స్త్రీలు గర్భధారణ సమయంలో విపరీతంగా వాంతులు చేసుకుంటారు..

Pregnancy: గర్భధారణ సమయంలో కొలెస్ట్రాల్ పెరిగితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదమా?
Pregnancy
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2024 | 1:11 PM

గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. గర్భధారణ సమయంలో స్త్రీలలో రక్తహీనత, మధుమేహం, అధిక బీపీ సమస్య చాలా సాధారణం. అయితే గర్భధారణ సమయంలో స్త్రీలలో కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందని మీకు తెలుసా. సకాలంలో నియంత్రించకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అటువంటి పరిస్థితిలో గర్భధారణ సమయంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం అని వైద్యులు సలహా ఇస్తారు.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ముందుగా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మహిళలు అలసట నుంచి ఛాతీ నొప్పి వరకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. కొంతమంది స్త్రీలు గర్భధారణ సమయంలో విపరీతంగా వాంతులు చేసుకుంటారు. అయితే ఇది అధిక కొలెస్ట్రాల్ లక్షణం అని భావించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమస్య అలాగే కొనసాగితే అది చెడు కొలెస్ట్రాల్ లక్షణం కావచ్చు. ఒక మహిళకు ఈ లక్షణాలు కనిపిస్తే, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

పిల్లలకి కూడా ప్రమాదకరం: ప్రెగ్నెన్సీ సమయంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించకపోతే అది బిడ్డకు హాని కలిగిస్తుందని ఎయిమ్స్‌లోని శిశువైద్యుడు డాక్టర్ రాకేష్ కుమార్ బగ్రీ అంటున్నారు. దీని వల్ల ఈ రెండు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

తక్కువ బరువు: గర్భధారణ సమయంలో కొలెస్ట్రాల్ పెరిగే సమస్య ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే అప్పుడు పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో ఉండవచ్చు.

గుండె వ్యాధి: గర్భధారణ సమయంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి నిరంతరం 100 కంటే ఎక్కువ ఉంటే అది పిల్లల గుండె ఆరోగ్యానికి ప్రాణాంతకం అని డాక్టర్ రాకేష్ చెప్పారు. దీని వల్ల పిల్లలకు గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అందుకే గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దీని కోసం మీ ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక కొవ్వు పదార్ధాలను తినవద్దు. మీ ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు చేర్చడం చాలా ముఖ్యమంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనలు, సలహాల మేరకు అందించాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి