Curry Leaves Benefits: కరివేపాకుతో ఆ సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు!
కరివేపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కరివేపాకును అన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా కరివేపాకు వేయనిదే.. పోపు ఫినిష్ కాదు. కరివేపాకు వేస్తే ఆ కూర, చట్నీ, రసం టేస్టే మారిపోతుంది. అంతే కాకుండా కర్రీకి మంచి సువాసన యాడ్ అవుతుంది. కూరలకు కూడా అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ చాలా మంది కరివేపాకే కదా అని తీసి పారేస్తారు. కరివేపాకును తియ్యటి వేపా అని కూడా పిలుస్తారు. మీరు కరివేపాకును తీసి పారేస్తుంటే..

కరివేపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కరివేపాకును అన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా కరివేపాకు వేయనిదే.. పోపు ఫినిష్ కాదు. కరివేపాకు వేస్తే ఆ కూర, చట్నీ, రసం టేస్టే మారిపోతుంది. అంతే కాకుండా కర్రీకి మంచి సువాసన యాడ్ అవుతుంది. కూరలకు కూడా అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ చాలా మంది కరివేపాకే కదా అని తీసి పారేస్తారు. కరివేపాకును తియ్యటి వేపా అని కూడా పిలుస్తారు. మీరు కరివేపాకును తీసి పారేస్తుంటే మాత్రం తప్పకుండా ఈ కథనాన్ని చదవాల్సిందే.
కరివేపాకు గొప్ప ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు దీన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, విటమిన్లు ఎ, బి, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకుతో ఉండే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెయిట్ లాస్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది:
కరియా లీవ్స్‌లో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి మీ శరీరం బరువు పెరగకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. సలాడ్చ ఇతర వంటల్లో కరివేపాకును ఉపయోగించి.. తప్పకుండా తీసుకోండి. ఎండిన కరివేపాకులను చిరుతిళ్లలో కూడా ఉపయోగించవచ్చు.
మలబద్ధకం సమస్య తీరుతుంది:
కరివేపాకు తినడం వల్ల కడుపు శుభ్ర పడుతుంది. దీంతో కడుపులో నొప్పి తగ్గుతుంది. ప్రేగుల్లో కదలికలను కూడా ప్రోత్సహిస్తుంది. దీంతో నిల్వ ఉన్న మలం బయటకు పోయేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్న వారు ఎండిన కరివే పాకు ఆకులను మెత్తగా పొడి చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగితే.. మంచి ఉపశమనం లభిస్తుంది.
సిక్‌నెస్‌ను దూరం చేస్తుంది:
చాలా మందికి ఉదయం లేచిన తర్వాత అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. మరికొంత మందికి తల తిప్పినట్లుగా, వికారంగా, ఉంటుంది. ఇలాంటి వారు కరివేపాకు పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే.. రిలీఫ్‌గా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ టిప్ బాగా సహాయ పడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.