Broccoli vs Cauliflower: ‘బ్రకోలీ వర్సెస్ కాలీ ఫ్లవర్’.. వీటిల్లో ఏది తింటే మంచిది!
బ్రకోలీ, కాలీ ఫ్లవర్ గురించి పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఇది కూడా ఒకటి. చూడటానికి ఇవి వేరు రంగుల్లో ఉన్నా వీటి గుణాలు మాత్రం ఒక్కటే. అలాగే ఈ రెండు కూడా ఒక జాతి అంటే క్రూసిఫెరస్ కుటుంబానికి చెందినవే. ఈ రెండిట్లో ఏది తింటే మంచిదోనన్న కన్‌ఫ్యూజన్‌లో చాలా మంది ఉంటారు. అయితే ఈ రెండిట్లో కాలీ ఫ్లవర్ తక్కువే అయినా.. బ్రకోలీ మాత్రం ఖరీదు ఎక్కువ. మరి ఈ రెండిట్లో ఏది తింటే ఎక్కువ..

బ్రకోలీ, కాలీ ఫ్లవర్ గురించి పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఇది కూడా ఒకటి. చూడటానికి ఇవి వేరు రంగుల్లో ఉన్నా వీటి గుణాలు మాత్రం ఒక్కటే. అలాగే ఈ రెండు కూడా ఒక జాతి అంటే క్రూసిఫెరస్ కుటుంబానికి చెందినవే. ఈ రెండిట్లో ఏది తింటే మంచిదోనన్న కన్‌ఫ్యూజన్‌లో చాలా మంది ఉంటారు. అయితే ఈ రెండిట్లో కాలీ ఫ్లవర్ తక్కువే అయినా.. బ్రకోలీ మాత్రం ఖరీదు ఎక్కువ. మరి ఈ రెండిట్లో ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రకోలీ:
బ్రకోలీ పోషకాల పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్లు సి, కే, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి వాటితో నిండి ఉంటుంది. బ్రకోలీ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకు పచ్చ రంగులో ఉండే ఈ బ్రకోలిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా నిండుగా ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అదే విధంగా బ్రకోలీలో సల్ఫోరాఫెన్ అనే యాంటీ ఆక్సిడెంట్.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
కాలీ ఫ్లవర్:
కాలీ ఫ్లవర్‌లో చాలా రకాల రంగులు ఉంటాయి. కానీ ఎక్కువ మంది లేత తెలుపు రంగులో ఉండే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. దీంతో అనేక రకాలైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. కాలీ ఫ్లవర్‌లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది తింటే బాడీ డీ హైడ్రేషన్‌కు గురి కాదు. అదే విధంగా రక్తం గడ్డ కట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి అవసరం అయిన క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
కాబట్టి ఎంత తిన్నా దీనిలో ఉండే అధిక ఫైబర్ సమతుల్య ఆహారానికి అవసరం పడతాయి. అదే విధంగా జీర్ణ ఆరోగ్యాన్ని పోషించే లక్షణాలు కూడా కాలీ ఫ్లవర్‌లో ఉన్నాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. కాలీ ఫ్లవర్ తింటే క్యాన్సర్లు ఎటాక్ చేయకుండా ఉంటాయి. బ్రకోలీతో పోల్చితే దీని రుచి బాగుంటుంది. అలాగే ఖరీదు కూడా తక్కువ. అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్ట పడుతూ ఉంటారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.




