Heart Tips: ఈ వ్యాయామాలు చేయండి.. గుండెను బలంగా ఉంచుకోండి!!

ప్రస్తుత కాలంలో వరుసగా చాలామంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. సినిమా చూస్తూ, వాకింగ్ చేస్తూ అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే గుండెను బలంగా ఉంచుకోవడం చాలా అవసరం. గుండెకు ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామాలు చేయాలి. మరి ఆ వ్యాయామాలు ఏంటో, వాటిని ఎలా చేస్తే మంచిదో తెలుసుకోండిలా. కార్డియో ఎక్సర్ సైజులు చేయడం వల్ల..

Heart Tips: ఈ వ్యాయామాలు చేయండి.. గుండెను బలంగా ఉంచుకోండి!!
Heart Tips
Follow us

|

Updated on: Jul 31, 2023 | 8:49 PM

ప్రస్తుత కాలంలో వరుసగా చాలామంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. సినిమా చూస్తూ, వాకింగ్ చేస్తూ అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే గుండెను బలంగా ఉంచుకోవడం చాలా అవసరం. గుండెకు ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామాలు చేయాలి. మరి ఆ వ్యాయామాలు ఏంటో, వాటిని ఎలా చేస్తే మంచిదో తెలుసుకోండిలా.

కార్డియో ఎక్సర్ సైజులు చేయడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ, కొలెస్ట్రాల్, బరువు తగ్గుతుంది. చాలా మంది కార్డియో వ్యాయామాలు చేస్తారు. కానీ వాటితో పాటే శరీర బరువు తగ్గించుకోవడం కూడా అవసరం. వారానికి రెండు సార్లు బరువులెత్తే వ్యాయామాలు కనీసం ఒక గంట అయినా చేయడం గుండెకు మంచిది.

ఏరోబిక్ ఎక్సర్ సైజ్: వారానికి కనీసం 150 నిమిషాలు మామూలు స్థాయి ఏరోబిక్ వ్యాయామాలు, 75 నిమిషాలు హై ఇంటెన్సీటీఏరోబిక్ ఎక్సర్ సైజ్ లు చేయవచ్చు. అలాగే వేగంగా నడవటం, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, రన్నింగ్ లేదా బాస్కెట్ బాల్ లాంటి ఆటలు ఆడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫ్లెక్సిబిలిటీ: శరీరం సాగేగుణాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. స్ట్రెచ్చింగ్, యోగా ఉత్తమమైనవి.

స్ట్రెంత్ ట్రైనింగ్: కాళ్లు, భుజాలు, వెన్ను కండరాల బలం కోసం ఈ వ్యాయామం చేయాలి. కనీసం వారానికి రెండు రోజులు అయినా ఇది చేయాలి.

వయసు, గుండె ఆరోగ్యం, ఫిట్ నెస్ బట్టి వివిధ రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మీకేమన్నా ఇబ్బందులు ఉంటే ముందుగా వైద్యుల్ని సంప్రదించడం మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి