AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut oil Benefits: కొబ్బరినూనెని జుట్టుకే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు!!

కొబ్బరితో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కొబ్బరి తినడం వల్ల శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కొబ్బరి నూనెని కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా ముఖానికి రాయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరినూనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా..

Coconut oil Benefits: కొబ్బరినూనెని జుట్టుకే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు!!
Coconut Oil Benefits
Chinni Enni
|

Updated on: Jul 31, 2023 | 7:56 PM

Share

కొబ్బరితో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కొబ్బరి తినడం వల్ల శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కొబ్బరి నూనెని కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా ముఖానికి రాయడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

-కొబ్బరినూనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లినోలిక్ యాసిడ్, విటమిన్ ఎఫ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పని చేసి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

-కొబ్బరి నూనెను పొడి, సాధారణ చర్మం ఉన్న వాళ్లు మాత్రమే ఉపయోగించాలి. జిడ్డులాగా చర్మం ఉన్న వాళ్లు ఈ నూనెను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖానికి రాయకూడదు.

ఇవి కూడా చదవండి

-కొబ్బరి నూనెతో ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

-రోజూ రెండు చుక్కల కొబ్బరి నూనె ముఖం, మెడకి రాయడం వల్ల స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది

-కొబ్బరి నూనెను చర్మంపై ఉపయోగించే ముందు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి.

-ఎల్లప్పుడూ వర్జిన్ కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించుకోవాలి.

-అలాగే కొబ్బరి అంటే అలర్జీ ఉన్నవారికి కొబ్బరి నూనెతో కూడా అలర్జీ రావచ్చు.

-సున్నితమైన చర్మ ఉన్న వారు కూడా కొబ్బరి నూనెను ఉపయోగించడం హానికరం

-కొబ్బరి నూనెను రోజూ ముఖానికి రాయడం వల్ల నల్లమచ్చలకు చెక్ పెట్టవచ్చు.

-రోజూ కొబ్బరినూనె రాయడం వల్ల చర్మం టోన్ తెలికపడుతుంది.

-కొబ్బరి నూనె రోజూ రాసుకోవడం వల్ల చర్మం నల్లగా అవుతుందని, కొందరు అంటూంటారు కానీ ఇది కేవలం అపోహ మాత్రమే.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి