Health Benefits: బెండ‌కాయ‌ కూర తిన్న త‌రువాత వీటిని అస్సలు తినకండి.. తింటే ఇక అంతే..

బెండ‌కాయ పులుసు, బెండ‌కాయ ఫ్రై, బెండ‌కాయ కూర వంటి వాటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటాం. ఇవి తిన్న త‌రువాత కాక‌ర‌కాయ‌ను అస్స‌లు తీసుకోకూడ‌దు. బెండ‌కాయ తిన్న త‌రువాత కాక‌రకాయ‌ను లేదా కాక‌ర‌కాయ తిన్న..

Health Benefits: బెండ‌కాయ‌ కూర తిన్న త‌రువాత వీటిని అస్సలు తినకండి.. తింటే ఇక అంతే..
Okra
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2022 | 9:58 PM

పచ్చి కూరగాయలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్ని కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. కానీ కొన్ని కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో  బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయలు మీకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ఇక ముందు తినకుండా ఉండలేదు. బెండకాయలు తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉండటమే కాకుండా మీ గుండెను ఫిట్‌గా ఉంచుతుంది. బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ ‘ సి ‘ దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము. దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును . డయాబిటీస్ నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది.

మనం చాలా రకాల కూరగాయలను ఇంట్లో వినియోగిస్తుంటాం. వాటిలో బెండ‌కాయ ఒక‌టి. బెండ‌కాయ‌ను పోష‌కాల గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. దీనిని తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. మనలో చాలా మంది బెండ‌కాయ‌ల‌ను చాలా ఇష్టంగా తింటాం. పులుసు కంటే కూడా బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌తో వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి దీనిని ఆహారంగా తీసుకున్న కొన్ని ప‌దార్థాల‌ను మ‌నం అస్స‌లు తీసుకోకూడ‌దు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బెండ‌కాయ‌ల‌ను తిన్న త‌రువాత తీసుకోకూడ‌ని ఆహార ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండ‌కాయ మ‌న శ‌రీరానికి పోష‌కాలను, చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ఇవ్వ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

బెండ‌కాయ పులుసు, బెండ‌కాయ ఫ్రై, బెండ‌కాయ కూర వంటి వాటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటాం. ఇవి తిన్న త‌రువాత కాక‌ర‌కాయ‌ను అస్స‌లు తీసుకోకూడ‌దు. బెండ‌కాయ తిన్న త‌రువాత కాక‌రకాయ‌ను లేదా కాక‌ర‌కాయ తిన్న త‌రువాత బెండ‌కాయ‌ను ఎంత అవసరం ఉన్నా తినకండి. ఇవి రెండు క‌డుపులో చేరిన త‌రువాత వాటి మ‌ధ్య‌లో రసాయనిక చ‌ర్య‌లు జ‌రుగుతాయి. దీంతో కడుపులో ఓ రకమైన విషంగా మారే అవ‌కాశం ఉంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బెండ‌కాయ‌ కూరను ఆ త‌రువాత కాక‌ర‌కాయ‌ను తినకండి.

ఈ మధ్యకాలంలో మిక్స్డ్ వెజిటెబుల్ చెట్నీలను రెడీ చేస్తున్నారు. ఇందులో మిగిలిన కూర‌గాయ‌ల‌న్నింటిని క‌లిపి ఒకే చెట్నీగా రెడీ చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ కూడా అన్ని కూర‌గాయ‌ల‌ను క‌లిపి వండ‌కూడ‌దు. ఎందుకంటే అవి ఒక దానితో మ‌రొక‌టి క‌లిసి ఉండే అవకాశం ఉండదు. అవి విషంగా మారే ప్ర‌మాదం కూడా ఉంది.

అలాగే బెండ‌కాయ తిన్న త‌రువాత మరో వంటకం కూడా ఉంది అదే ముల్లంగి.. కాకరకాయతోపాటు ముల్లంగి అస్సలు తినకండి. వాటి మ‌ధ్య ర‌సాయ‌నిక చ‌ర్య‌లు జ‌రిగి శ‌రీరంలో తెల్ల‌టి మ‌చ్చ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌నుక బెండ‌కాయ త‌రువాత ముల్లంగిని లేదా ముల్లంగి త‌రువాత బెండ‌కాయ‌ను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?