Father Of Ors: డయేరియాకు సంజీవని ఓఆర్ఎస్ డ్రింక్ .. ఇది ఎలా పుట్టింది? ఎవరు సృష్టించారో తెలుసా..!

| Edited By: Surya Kala

Oct 29, 2023 | 2:59 PM

ఈ మధ్యకాలంలో విపరీతంగా ఓఆర్ఎస్ డ్రింక్ వాడకం పెరిగిపోయింది. అయితే దీనిని 20వ శతాబ్దంలోనే గొప్ప మెడికల్ ఇన్వెన్షన్ గా చెప్పుకుంటారు. ఇప్పటికి ఓఆర్ఎస్ ను కనిపెట్టి 50 సంవత్సరాలయింది. ఇతర మందులతో పోలిస్తే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడిన ఔషధం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది పిల్లల ప్రాణాలను సేవ్ చేస్తుంది.

Father Of Ors: డయేరియాకు సంజీవని ఓఆర్ఎస్ డ్రింక్ .. ఇది ఎలా పుట్టింది? ఎవరు సృష్టించారో తెలుసా..!
Ors Drink
Follow us on

కళ్ళు తిరగడం, నీరసం లాంటివి వచ్చినప్పుడు ORS డ్రింక్ సంజీవనిలా పనిచేస్తుంది.  విపరీతమైనటువంటి ఎండలో డిహైడ్రేషన్ కు గురైనా,  మనిషి నీరస పడినా .. అత్యవసర పరిస్థితుల్లో నైనా.. ఇలా చాలా సందర్భాల్లో ఓఆర్ఎస్ డ్రింక్ ను తాగుతాం.. ఈ డ్రింక్ తాగిన తర్వాత శరీరానికి శక్తి వస్తుంది.. త్వరగా కోలుకునే చేస్తుంది. ఇలా అన్ని లాభాలు ఉన్నటువంటి ఓఆర్ఎస్ ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ రోజు ఓఆర్ఎస్ డ్రింక్ పుట్టుక గురించి తెలుసుకుందాం..

ఓఆర్ఎస్ డ్రింక్ గురించి అందరికీ తెలుసు. కరోనా తర్వాత ఓఆర్ఎస్ డ్రింక్ వాడకం విపరీతంగా పెరిగింది.. పెరిగినటువంటి పని  ఒత్తిళ్లు, టెన్షన్స్ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు నీరసపడిపోతున్నారు చాలా మంది. ఇలాంటి సమయాల్లో ఓఆర్ఎస్ తాగితే తిరిగి శక్తిని పుంజుకుని మళ్లీ పనిచేసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.. అయితే ఇంతటి సంజీవనిగా పని చేస్తున్నటువంటి ఓఆర్ఎస్ డ్రింక్ ప్రపంచానికి పరిచయం చేసింది దిలీప్ మహాలనబిస్. 1970లో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో చాలామంది మన దేశానికి వలస వచ్చారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున కలరా వ్యాపించింది. మంచి నీళ్లు శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడంతో కలరా బారిన పడి చాలా మంది చనిపోయారు. సమయానికి సెలైన్లు, ఫ్లూయిడ్స్ కొరత ఏర్పడి సమయానికి అందేవి కావు. ఆ సమయంలో దిలీప్ మహలనబీస్ ఉప్పు, పంచదార కలిపిన నీళ్లను పేషంట్లకు ఇవ్వమని శిబిరాల్లో ఉన్నటువంటి వారికి చెప్పారు. ఆ తరువాత మరణాల సంఖ్య తగ్గిపోయింది. ఆ తర్వాత ఓఆర్ఎస్ డ్రింక్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పెరిగింది.

ఈ మధ్యకాలంలో విపరీతంగా ఓఆర్ఎస్ డ్రింక్ వాడకం పెరిగిపోయింది. అయితే దీనిని 20వ శతాబ్దంలోనే గొప్ప మెడికల్ ఇన్వెన్షన్ గా చెప్పుకుంటారు. ఇప్పటికి ఓఆర్ఎస్ ను కనిపెట్టి 50 సంవత్సరాలయింది. ఇతర మందులతో పోలిస్తే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడిన ఔషధం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది పిల్లల ప్రాణాలను సేవ్ చేస్తుంది. డయేరియా వ్యాధి ఉన్న దాదాపు 90 శాతం పిల్లలను ఓఆర్ఎస్ ఒక్కటే  కాపాడుతుంది.. మిగతా 10 శాతం పిల్లలకు మాత్రమే వైద్యం అవసరమవుతుంది

ఇవి కూడా చదవండి

దిలీప్ మహలానబీస్ చిన్నపిల్లల డాక్టర్ కోల్కతాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో రీసెర్చ్ స్కాలర్గా పనిచేసేవారు. 1966లో ఢిల్లీ ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ప్రాజెక్టుపై పని చేశారు. ఆ తర్వాత డాక్టర్ డెవిడ్ ఆర్నలిస్ట్ డాక్టర్ రీచార్డ్ ఏ క్యాష్ తో కలిసి ఓరల్ రీహైడ్రైజేషన్ సొల్యూషన్ అంటే ఓఆర్ఎస్ ను కనిపెట్టారు.  ఆయన కనిపెట్టిన చిట్కాలు ఇప్పటికి ఇండ్లలో వాడుతున్నారు. నీరసంగా ఉన్నప్పుడు ఓ గ్లాసులు నీటిలో చిడికెడు ఉప్పు కొద్దిగా పంచదార కలిపి ఇవ్వడం చూస్తుంటాం సింపుల్ చిట్కాగా కనిపించే సంజీవని ఓఆర్ఎస్ గురించి చెప్పిన దిలీప్ 88 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. కానీ ఈ స్టోరీ చదివిన తర్వాత ఇకపై ఎవరికైనా ఓఆర్ఎస్ ను చూస్తే దిలీప్ మహలనబీస్ గుర్తొస్తారనడంలో సందేహం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..