Telugu News » Health » Digestive system is often disturbed try these natural remedies problem will run away
Digestive System Process: కొంచెం తిన్నా.. కడుపులో ఇబ్బందులు వేధిస్తున్నాయా..? అయితే ఈ పద్ధతులు పాటించండి..
Digestive System problems - remedies: ఆధునిక ప్రపంచంలో అందరూ రుచికరమైన ఆహారానికి అలావాటుపడ్డారు. అయితే వారిలో జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదైనా కొంచెం ఆహారం తిన్నా..
కడుపులో సమస్యలను ఉత్పన్నంకాకుండా చేయడంలో గోరువెచ్చని నీరు చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే జీర్ణవ్యస్థ మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
2 / 6
ఫైబర్ ఎక్కువ పదార్థాలున్న ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలను తినాలని సూచిస్తున్నారు.
3 / 6
తరచుగా.. మీ జీర్ణవ్యవస్థ ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమవుతుంటే.. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణవ్యవస్థను రీసెట్ చేయడానికి ఉపవాసం మంచిగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
4 / 6
జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా లేనప్పుడు.. చల్లని పానీయాలు తీసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటప్పుడు కుండలో నీటిని తాగాలి. ముఖ్యంగా ఫ్రిజ్‌లోని పదార్థాలను తినడం మానుకోవాలని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
5 / 6
ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒక గంట లేదా అరగంటపాటు వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక వల్ల ఆరోగ్యంతోపాటు.. జీర్ణవ్యవస్థ ప్రక్రియ కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు యోగా ఆసనాలు కూడా మేలు చేస్తాయని సూచిస్తున్నారు.