ఉల్లిపాయలతో ఇలా చేస్తే డయాబెటిస్ సమస్యే ఉండదు తెలుసా..? బాధితులైతే మీరూ ట్రై చేయండి..
మీరు సమతుల్య జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం ద్వారా మధుమేహం నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యంపై కొంచెం కూడా అజాగ్రత్తగా ఉంటే, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని మధుమేహ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డయాబెటిస్ చాలా క్లిష్టమైన వ్యాధి.. అది ఒక వ్యక్తిని బాధితుడిగా మారిస్తే.. అది జీవితాంతం అతన్ని వదిలిపెట్టదు.. వైద్య శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా చాలా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ, శాస్త్రవేత్తలు డయాబెటిస్ నివారణ, చికిత్స కోసం ఎటువంటి ఔషధాన్ని కనుగొనలేదు. అయితే, మీరు సమతుల్య జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం ద్వారా మధుమేహం నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యంపై కొంచెం కూడా అజాగ్రత్తగా ఉంటే, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని మధుమేహ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ డైటీషియన్లు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం ఒక నిర్దిష్ట కూరగాయలను ఉడికించి, దాని నీటిని తాగితే, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండటమే కాకుండా, మన శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.. అలాంటి వాటి ఉల్లిపాయ చాలా మేలు చేస్తుందని నిపుణులు తెలిపారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయ రసం తాగితే..
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలనుకుంటే.. ఈ రోజు నుంచే ఉల్లిపాయ రసం తాగడం ప్రారంభించాలని సూచిస్తున్నారు.. దీని సహాయంతో, టైప్-1, టైప్-2 రోగులకు ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయ గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. దీని కారణంగా దాని జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. రక్త ప్రవాహంలో చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది.
ఉల్లిపాయను ఉడికించి దాని రసాన్ని తీసి తాగితే శరీరానికి డిటాక్స్ డ్రింక్స్ లా పని చేస్తుంది. ఈ హోం రెమెడీ వల్ల శరీరంలో క్యాలరీలు తగ్గుతాయి. డయాబెటిక్ పేషెంట్లు చాలా ప్రయోజనాలను పొందుతారు.
ఉల్లిపాయ వాటర్ ఎలా చేయాలంటే..
దీని కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలను కోయాలి. అనంతరం ఉల్లి ముక్కలను మిక్సర్ గ్రైండర్‌లో వేసి, ఆపై 1 కప్పు నీరు, చిటికెడు నల్ల ఉప్పు, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని తాగడం ద్వారా, శరీరానికి పుష్కలంగా ఫైబర్, అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఇది బాగా సహాయపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
