Health: చలి కాలమని తక్కువ నీరు తాగుతున్నారా.? మానసిక సమస్యలు తప్పవు..
శరీరానికి తగిన మొత్తంలో నీరు అందకపోతే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరిపడ నీరు అందకపోతే మానసిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తక్కువ నీరు తాగితే తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. శరీరంలోని హైడ్రేషన్ స్థాయి తగ్గి తలనొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే వాతావరణంతో సంబంధం లేకుండా..

చలికాలంలో సహజంగానే తక్కువ నీరు తాగుతారు. వాతావరణం చల్లగా ఉండడంతో దాహం వేయదు, దీంతో సహజంగానే నీరు తక్కువగా తాగుతుంటారు. అయితే బయట వాతావరణం ఎలా ఉన్నా.. శరీరంలో సరిపడ నీరు లేకపోతే మాత్రం డీహైడ్రేషన్‌కు గురికాక తప్పదు. శరీరం హైడ్రేట్‌గా ఉంచి శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.
శరీరానికి తగిన మొత్తంలో నీరు అందకపోతే తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరిపడ నీరు అందకపోతే మానసిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తక్కువ నీరు తాగితే తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. శరీరంలోని హైడ్రేషన్ స్థాయి తగ్గి తలనొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే వాతావరణంతో సంబంధం లేకుండా కచ్చితంగా ప్రతిరోజూ సరిపడ నీరు తీసుకోవాలి.
డీహైడ్రేషన్ కారణంగా మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా డీహైడ్రేషన్‌కు గురైతే మెదడులో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి. దీంతో మెదడులో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది, ఇది పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక కాలంతో పాటు సంబంధం లేకుండా కచ్చితంగా సరిపడ నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో తక్కువ నీరు తాగుతుంటారు. అయితే ఇలా చేయకూడదు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..