రైలు పట్టాలపై ట్రక్.. ఇంతలో దూసుకొచ్చిన రైలు వీడియో
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా రైల్వే పట్టాలపైకి దూసుకొచ్చిన ట్రక్కు..రైల్వే గేటును ఢీకొని, పట్టాలపైకి చేరుకుంది. ఇంతలో అదే ట్రాక్‌పైకి వేగంగా వచ్చిన అంబా ఎక్స్‌ప్రెస్ ఆ ట్రక్కును బలంగా ఢీకొంది. అయితే అంతకన్నా ముందే ట్రక్కు డ్రైవర్ కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. జల్గావ్ జిల్లాలోని బోద్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ప్రమాదంలో రైలు వేగంగా ఢీకొనడంతో ట్రక్కు తునాతునకలయ్యింది. ట్రక్కులోని కొంతభాగం రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పి ఉంటే మాత్రం పెను ప్రమాదం వాటిల్లేదని ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైరు మాత్రం దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిబంధనలను పట్టించుకోకుండా రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నం చేయడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు గుర్తించారు. రైల్వేశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.
మరిన్ని వీడియోల కోసం :
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
