Nonveg Food: వేసవిలోనూ నాన్ వెజ్ ఫుడ్ లాగించేస్తున్నారా.. వారికి మాత్రం ఇది డేంజరే..
వేసవి కాలం అంటేనే తినే మరియు త్రాగే అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తినడంలో, తాగడంలో కొద్ది పాటి నిర్లక్ష్యం కూడా మనకు డేంజరే. దాని పర్యవసానాలను కచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. వేసవిలో చేపలు, చికెన్, మటన్ లేదా గుడ్లు తినాలా వద్దా అనే ప్రశ్న మాంసాహారుల మనస్సులలో కూడా తరచుగా తలెత్తుతుంది. దీని గురించిన సమాచారం ఇది..

ఏ కాలమైనా నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగని వారు ఉంటారు. అయితే, అన్ని కాలాలు వేరు. ఒక్క ఎండాకాలం మాత్రం ఆరోగ్యం, ఆహారం పరంగా ఎంతో జాగ్రత్తగా మెలగాల్సిన సమయం. మండే ఎండల్లో మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మనం డీహైడ్రేషన్ కు లోనవుతుంటాం. అయితే, మీకు నాన్ వెజ్ ఎంత ఇష్టమైనా కూడా వారానికి ఒకటి రెండు సార్లకే పరిమితం చేయాలని ఎక్కువగా తినేయడం వల్ల ఎన్నో సమస్యలు పుట్టుకొస్తాయని నిపుణుల చెప్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి..
నిపుణులు ఏమంటున్నారు..
వేసవిలో మాంసం తినడం పూర్తిగా మానేయాలి లేదా అతిగా తినడం మానేయాలి. దీనికి కారణం మాంసాహారం అంటేనే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో శరీరంలో వేడి పెరిగిపోతుంది. శరీరం వేడెక్కుతున్న కొద్దీ, మీకు ఎక్కువగా చెమట పట్టడం మొదలవుతుంది.
ఇదే కాకుండా, చేపలు, చికెన్, మటన్ లేదా గుడ్లు భారీ ఆహారాలు, మీ కడుపులో ఉండే రసాయనాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని కారణంగా మీ జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. జీర్ణ ప్రక్రియ చెదిరిపోతే మీకు విరేచనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కడుపునొప్పి అతిసారం సమస్య కూడా రావచ్చు.
పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా ఇదే సీజన్ కావడంతో కొందరు అక్కడి భోజనం వికటించి అనారోగ్యం పాలవుతుంటారు. ఒకవేళ తినాల్సి వచ్చినా దానికి తోడుగా మజ్జిగ, చలువ చేసే ద్రవ పదార్థాలు, మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటివి బాగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇవి మలబద్ధకాన్ని కలిగిస్తాయి.
గర్భిణీ స్త్రీలకు చేపలు చాలా ప్రమాదకరం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో చేపలను చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. చేపలకు వేడి స్వభావం ఉంటుంది. దానిని అధికంగా తీసుకోవడం వల్ల గర్భస్రావం జరగవచ్చు. అయితే, చేపలు తినడం తల్లి మరియు బిడ్డకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు కూడా అంటున్నారు. అందువల్ల వేడిని బ్యాలెన్స్ చేస్తూ మితంగా తీసుకోవడం మేలు. ఇక వేసవిలో వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
నాన్ వెజ్ మానేస్తే ఏమవుతుంది..
ఎండాకాలం ఒక నెల రోజుల పాటు నాన్ వెజ్‌ను పూర్తిగా మానేసి.. కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీరంలో శక్తి స్థాయిని పెంచుతాయి. నీరసం తగ్గుతుంది. యూరిక్ యాసిడ్ తగ్గి ఒంటినప్పులు తగ్గుముఖం పడతాయి. మలబద్ధకం ఉన్నవారు వెజిటేరియన్ తీసుకోవడం వల్ల ఈ బాధ నుంచి విముక్తి పొందుతారు. తాజా కూరలు పొట్టను హాయిగా, లైట్ గా ఉంచుతాయి.