ఎప్పుడైనా ఆలోచించారా? నేలపై పడుకోవడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?
samatha
21 march 2025
Credit: Instagram
ఒకప్పుడు మన పెద్దవారు ఎక్కువగా నేలమీదనే పడుకునే వారు అని చెప్తుంటారు. కానీ ఇప్పటి వారు నేల మీద పడుకోవడానికి అస్సలే ఇష్టపడరు.
అయితే నేల మీద పడుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంని చెబుతుంటారు. మరి నిజంగానే నేల మీద పడుకోవడం ఆరోగ్యానికి మంచిదా? కాదా ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు నేల మీద పడుకోవడం వలన ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేలపై నిద్రపోవడం వలన అది బరువు తగ్గడానికి సహాయపడుతుందంట.
నేలపై పడుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. నేలపై పడుకోవడం వలన మనసు, శరీరం ఒకే సమయంలో విశ్రాంతి తీసుకోవడం వలన అది ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందంట.
వెన్ను, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు నేలపై పడుకోవడం వలన ఆ సమస్యల నుంచి బయటపడవచ్చునంట. దీని వలన రక్తప్రసరన సాఫీగా సాగి వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అయితే నేల మీద పడుకోవడం వలన అనేక లాభాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
అలెర్జీ ఉన్నవారు నేలపై అస్సలే పడుకోకూడదంట. దీని వలన దురద, తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంట.
అదే విధంగా నేలపై చాప వేసుకొని పడుకోవడం వలన అనేక నష్టాలు ఉన్నాయంట. దీని వలన వెంటిలేషన్ లేకపోవడంతో చర్మానికి చెమటలు పట్టీ శరీరం నుంచి దుర్వాసన వస్తుందంట.