Coronavirus Spread: కరోనా వైరస్ అలా కూడా అంటుకుంటుంది.. వైద్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే..షాకింగ్ పరిశోధన!

కరోనా వైరస్ మూడో వేవ్ ముప్పు ముంగిట మరో షాకింగ్ విషయం బయట పెట్టారు పరిశోధకులు. కరోనా మరో రకంగా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇది వైద్యులకూ ఇబ్బంది కలిగించే అవకాశాలున్నాయట!

Coronavirus Spread: కరోనా వైరస్ అలా కూడా అంటుకుంటుంది.. వైద్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే..షాకింగ్ పరిశోధన!
Coronavirus Spread
Follow us
KVD Varma

|

Updated on: Aug 03, 2021 | 5:15 PM

Coronavirus Spread: కరోనా సోకిన వ్యక్తి కన్నీళ్ల ద్వారా వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల కంటి వైద్యులు మరింత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచించారు. అమృత్‌సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహించిన తమ పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొంది. ఈ అధ్యయనం కోసం, రోగి ఆర్టీపీసీఆర్ (RT-PCR) నివేదిక అందిన 48 గంటలలోపు కన్నీటి నమూనాలను తీసుకున్నారు. పరిశోధన ప్రకారం, నేత్ర వ్యక్తీకరణ ఉన్న రోగుల నుండి కన్నీళ్లు లేదా అది లేకుండా కరోనా సంక్రమణకు కారణం కావచ్చు. నేత్ర వ్యక్తీకరణ అంటే  శరీరంలో ఏదో ఒక వ్యాధి కారణంగా కంటిని ప్రభావితం చేసే లక్షణం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శరీరంలో ఏదైనా వ్యాధి వచ్చినపుడు అది కంటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు. అప్పుడు కంటిలో కనిపించే లక్షణాలను నేత్ర వ్యక్తీకరణగా చెబుతారు.

120 మంది రోగులపై అధ్యయనం..

అమృత్‌సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల 120 మంది కరోనా రోగులపై ఈ అధ్యయనం చేసింది. 60 మంది రోగులలో కన్నీళ్ల ద్వారా వైరస్ శరీరంలోని మరొక భాగానికి చేరిందని నివేదికలో వెల్లడైంది. 60 మంది రోగులలో ఇది జరగలేదు.  ఈ పరిశోధనకు ఎంచుకున్న రోగుల్లో 41 మందికి కండ్లకలక హైపెరెమియా, 38 మందిలో ఫోలిక్యులర్ రియాక్షన్స్, 35 లో కెమోసిస్, 20 మంది రోగులలో మ్యూకోయిడ్ డిశ్చార్జ్, ఎచింగ్ చేయడంలో ఇబ్బంది ఉంది.

అయితే, కంటి వ్యక్తీకరణ ఉన్న రోగులలో దాదాపు 37% మందికి కరోనా వైరస్ పాక్షిక లక్షణాలు ఉంటాయి. మిగిలిన 63% సంక్రమణ తీవ్ర లక్షణాలను చూపించాయి. నివేదిక ప్రకారం, ఆర్టీపీసీఆర్ (RT-PCR)  కోసం కన్నీళ్లు పరీక్షించిన రోగులలో 17.5% కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. 11 మంది రోగులు (9.16%) నేత్ర వ్యక్తీకరణలు కలిగి ఉన్నారు . అదేవిధంగా, వీరిలో  10 (8.33%) మందికి అలాంటి ఫిర్యాదులు లేవు. వ్యాధి సోకిన రోగులు కండ్లకలక స్రావాలలో సంక్రమణను క్లియర్ చేయగలరని నివేదిక పేర్కొంది.

వైద్య సిబ్బంది-వైద్యులు అప్రమత్తంగా ఉండాలి..

ఈ పరిశోధనను డాక్టర్ ప్రేంపల్ కౌర్, డాక్టర్ గౌరంగ్ సెహగల్, డాక్టర్ షైల్‌ప్రీత్, కెడి సింగ్, భావకరన్ సింగ్ చేశారు. అధ్యయన నివేదిక ప్రకారం, కరోనా సోకిన రోగుల కన్నీళ్లు వారి సంరక్షణలో నిమగ్నమైన వైద్య సిబ్బందికి సంక్రమణకు మూలం కావచ్చు. అందువల్ల వైద్య సిబ్బంది, కంటి వైద్యుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ప్రత్యేకించి కళ్ళు, ముక్కు, నోటిని పరీక్షించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.

Also Read: Mosquito Control: మలేరియా వ్యాప్తి చేసే దోమల భరతం పట్టడానికి కొత్త మార్గం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

Corona 3rd Wave: పెరుగుతున్న కరోనా పునరుత్పత్తి మూడో వేవ్‌కు సంకేతమా? అసలు పునరుత్పత్తి రేటు అంటే ఎమిటి?  పూర్తి వివరాలు..