AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీకేర్‌ఫుల్..! శరీరంలో ఈ ఖనిజం లోపం ఉంటే జుట్టు నెరిసిపోతుందట..

అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే.. మనం తీసుకునే ఆహారంలో ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.. అలాంటి ముఖ్యమైన ఖనిజాల్లో రాగి ఒకటి.. రాగి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.. కానీ ఇది తక్కువ పరిమాణంలో అవసరం. ఈ పోషకం ఎర్ర రక్త కణాలు, ఎముకలు, బంధన కణజాలం, కొన్ని ముఖ్యమైన ఎంజైమ్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

బీకేర్‌ఫుల్..! శరీరంలో ఈ ఖనిజం లోపం ఉంటే జుట్టు నెరిసిపోతుందట..
Copper Deficiency
Shaik Madar Saheb
|

Updated on: Mar 27, 2024 | 12:59 PM

Share

అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే.. మనం తీసుకునే ఆహారంలో ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.. అలాంటి ముఖ్యమైన ఖనిజాల్లో రాగి ఒకటి.. రాగి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.. కానీ ఇది తక్కువ పరిమాణంలో అవసరం. ఈ పోషకం ఎర్ర రక్త కణాలు, ఎముకలు, బంధన కణజాలం, కొన్ని ముఖ్యమైన ఎంజైమ్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాపర్ కొలెస్ట్రాల్ ప్రాసెసింగ్, మీ రోగనిరోధక వ్యవస్థ సరైన పనితీరు, కడుపులో శిశువుల అభివృద్ధికి కూడా కాపర్ అవసరం.. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి ప్రతిరోజూ 900 mg రాగి అవసరం.. ఈ పోషకం లోపం వల్ల అలసట, బలహీనత, తరచుగా అనారోగ్యం, బలహీనమైన, పెళుసుగా ఉండే ఎముకలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నడవడంలో ఇబ్బంది, చలికి సున్నితత్వం, లేత చర్మం, జుట్టు నెరిసిపోవడం, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.. అందుకే.. కాపర్ రిచ్ ఫుడ్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి.. రాగి సమృద్ధిగా ఉండే పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

కాపర్ రిచ్ ఫుడ్స్..

నట్స్: నట్స్ ను పోషకాల నిధి అని పిలుస్తారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో రాగి కూడా సమృద్ధిగా లభిస్తుంది. బాదం, వేరుశెనగ లాంటి వాటని తింటే ఈ పోషకానికి లోటు ఉండదు.

రొయ్యలు: రొయ్యలు సముద్రపు అడుగుభాగంలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా పలు ప్రాంతాల్లో వీటిని పెంచుతారు. రొయ్యల మాంసంలో తక్కువ కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా అధిక ప్రోటీన్, సెలీనియం, విటమిన్ B12తో సహా పలు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో రాగి కూడా పుష్కలంగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.. ఇందులో కోకో ఘనపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ చక్కెర కంటెంట్ కూడా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని నిత్యం తినడం వల్ల శరీరానికి రాగి పుష్కలంగా అందుతుంది.

తృణధాన్యాలు: తృణధాన్యాలు (గింజలు) వంటి వాటిల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో రాగి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో నువ్వులను రాగి పవర్‌హౌస్ అని కూడా పిలుస్తారు.

ఆకు కూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దాదాపు అన్ని మంచివే.. వీటిలో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ ఇందులో ఉంటాయి. బచ్చలికూర, పాలకూర లాంటివి తింటే శరీరంలో రాగి లోపం అనే మాటే ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..