Tomato Health Benefits: పరగడుపున టమాటాలు తింటే ఇలా అవుతుందా..? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది..!

టమాటాలను అందం కోసం కూడా చాలా హోం రెమెడీస్ లో ఉపయోగిస్తుంటారు. అంతే కాదు, టమాటాలను అనేక సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. టమాటాలో విటమిన్ సి, లైకోపీన్, విటమిన్ కె, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. టమాటా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది . టమోటాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

Tomato Health Benefits: పరగడుపున టమాటాలు తింటే ఇలా అవుతుందా..? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది..!
Tomato Health Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 27, 2024 | 11:36 AM

Tomato Health Benefits: ఇంట్లో కూరగాయలు, పప్పు రుచిని పెంచడానికి ఉపయోగించే టమాటాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమాటాలను తరచుగా కూరలు, సలాడ్‌లు, సూప్‌లు, చట్నీలలో ఉపయోగిస్తారు. టమాటాలు చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. టమాటాలను అందం కోసం కూడా చాలా హోం రెమెడీస్ లో ఉపయోగిస్తుంటారు. అంతే కాదు, టమాటాలను అనేక సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. టమాటాలో విటమిన్ సి, లైకోపీన్, విటమిన్ కె, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. టమాటా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది . టమోటాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

టమాటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

1- బాగా పండిన టమాటాలను ఉదయం పూట నీళ్లు తాగకుండా ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

2- రికెట్స్‌తో బాధపడుతున్న పిల్లలకు రోజూ ఒక గ్లాసు టమాటా రసం ఇవ్వాలి. దీంతో వారికి ఎంతో మేలు జరుగుతుంది.

3- టమాటా తినడం వల్ల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి మెరుగుపడుతుంది.

4- బరువు తగ్గడానికి, మీరు టమాటాలు తినండి. మీరు టమాటాను సలాడ్‌లో కూడా చేర్చుకుని తినవచ్చు. లేదా 1-2 గ్లాసుల టమాటా రసం చేసుకుని కూడా తాగొచ్చు.

5- ఆర్థరైటిస్‌తో బాధపడేవారు టమాటా తినాలి. టమాటా జ్యూస్‌లో సెలెరీని కలిపి తాగడం సహాయపడుతుంది.

6- గర్భిణీలకు కూడా టమాటా మేలు చేస్తుంది. దీని కారణంగా శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. గర్భధారణ సమయంలో శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

7- కడుపులో నులిపురుగుల సమస్య ఉంటే ఖాళీ కడుపుతో టమాటా ఎండుమిర్చి కలిపి తింటే మంచిది.

8- రోజూ పచ్చి టమాటాలు తింటే ముఖం మెరుస్తుంది.

9- టమాటా తినడమే కాకుండా ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇందుకోసం టమాటా గుజ్జును ముఖానికి రాసుకుంటే మెరుపు వస్తుంది.

10- టమాటా తినడం మధుమేహంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..