వంటిల్లే వైద్య శాల అని పెద్దలు ఊరికే అనలేదు. వంటింట్లో ఉండే కొన్ని రకాల సరుకులతో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇలా మన వంటింట్లో ఉండే వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులను తరచూ తీసుకుంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు బై చెప్పవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, మల బద్ధకం, కడుపులో నొప్పి వంటి వాటిని దూరంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా దంత క్షయం నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది. పురుషులు యాలకులను తీసుకోవడం వల్ల వారిలో శారీరక సామార్థ్యం అనేది పెరుగుతుంది. ఇంకా యాలకులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషులకు ప్రయోజనం:
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో రెండు యాలకులను కలిపి తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా తీసుకుంటే పురుషుల్లో నపుంసకత్వము కూడా తొలగిపోతుంది.
నోటి దుర్వాసన పోతుంది:
యాలకులను తరచూ తినడం వల్ల నోటి నుంచి దుర్వాసన అనేది దూరం అవుతుంది. నోరు ఫ్రెష్ గా ఉంటుంది.
క్యాన్సర్ దూరం అవుతుంది:
యాలకుల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ కణాలు అనేవి తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. క్యాన్సర్ ఉన్న వారు తీసుకుంటే.. క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చు.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
మీరు తినే ఆహారంలో యాలకులను చేర్చు కోవడం వల్ల గుండె జబ్బులను తగ్గించు కోవచ్చు. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
కాలేయం హెల్దీగా ఉంటుంది:
యాలకులను తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. కాలయే సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. యాలకుల్లో ఉండే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్.. శరీరంలో ఉండే టాక్సిన్ లను తొలగిస్తుంది.
బరువు తగ్గుతారు:
బరువు తగ్గాలి అనుకున్న వారు తమ డైట్ లో యాలకులను చేర్చు కోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వొచ్చు. యాలకుల్లో ఉండే పోషకాలు బరువు పెరగకుండా చూస్తుంది.
నిద్ర లేమి సమస్యలు తగ్గుతాయి:
యాలకులను క్రమం తప్పకుండా ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. నిద్ర పట్టని వారు యాలకులను వేడి నీటితో కలిపి తాగితే.. నిద్రను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా నిద్రలో వచ్చే గురక సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.