Coconut Sugar: తెల్ల చక్కెర కంటే కోకో షుగర్ ఎందుకు ఆరోగ్యకరమైనదంటే.. దీనిలో చాలా..
చెక్కర.. అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వైట్ షుగర్. ఆ తర్వాత బెల్లం, బ్రౌన్ షుగర్, తాటి బెల్లం.. ఆ తర్వాతా అంతే.. ఇక మనకు తెలిసినవి ఇవే.. ఇవి కాకుండా అంటే మనం చెప్పలేం. కానీ వీటితోపాటు చెరుకు నుంచి మాత్రమే కాకుండా చాలా వాటితో షుగర్ ఉత్పత్తి చేస్తారు. అందులో కొబ్బరి చెక్కర. అంటే కొబ్బరి నుంచి తీసిన చెక్కర. కొబ్బరి చెక్కర గురించి మీరు అస్సలు విని ఉండరు. అసలు ఇది ఏంటి..? దీనితో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

మనకు తెలిసింది కేవలం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతున్న చెక్కర గురించి మాత్రమే. అయితే తెల్ల చక్కెరను, దానితో చేసిన స్వీట్స్ చాలాసార్లు తింటారు. వాటి గురించి మనలో అందరికి తెలుసు. ఈ ఆహార పదార్ధం ఆరోగ్యానికి శత్రువుగా పరిగణించబడుతుంది.. ఎందుకంటే ఇది టైప్-2 మధుమేహం, ఊబకాయం,అనేక ఇతర వ్యాధులను కలిగిస్తుంది. కానీ మీకు చెక్కరను మరోదాని నుంచి కూడా తీస్తారు.. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అదే కోకో షుగర్. దీనిని ఫైట్ షుగర్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇందులో కొబ్బరి పామ్ చక్కెర కూడా ఉంటుంది. ఇది గోధుమ రంగులో కనిపిస్తుంది. తెల్ల చక్కెర కంటే కొబ్బరి పంచదార ఎందుకు మేలు చేస్తుంది. ఆ కొబ్బరి చెక్కరతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
కొబ్బరి చక్కెర ప్రయోజనాలు
1. పూర్తి పోషకాలు:
కొబ్బరి చక్కెర తయారు చేసిన తర్వాత కూడా.. కొబ్బరి పామ్‌లో ఉండే పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి, ఇందులో ఇనుము, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ పోషకాల పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మీరు ఇప్పటికీ దాని ప్రయోజనాన్ని పొందవచ్చు.
2. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్:
కొబ్బరి చక్కెర తెల్ల చక్కెరతో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిని పెద్దగా పెంచదు. సాధారణ ప్రజలు కూడా తెల్ల చక్కెరకు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా దీనిని స్వీకరించాలి. ఎందుకంటే ఇది మధుమేహం ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
3. సహజ స్వీట్ ఫ్లేవర్:
కొబ్బరి చక్కెర రుచి వంటి ప్రత్యేక పాకం కలిగి ఉంటుంది. దాని సహాయంతో అనేక తీపి వంటకాలు, పానీయాలు తయారు చేయవచ్చు. దీని రుచి సాధారణ చక్కెర వలె తీపిగా ఉంటుంది.
దీన్ని గుర్తుంచుకోండి.. అయితే, కొబ్బరి చక్కెర ఇప్పటికీ ఒక రకమైన చక్కెర అని గుర్తుంచుకోండి. మితంగా తీసుకోవాలి. ఇది కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ.. ఏదైనా చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, దంతక్షయం, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి




