Health Tips: శరీరంలో 5 లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే జాగ్రత్త పడాలి.. లేదంటే తీవ్రనష్టం..
Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. నేషనల్ హెల్త్ పోర్టల్ ప్రకారం, భారతదేశంలో 9 నుంచి 32 శాతం మందికి ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయ వ్యాధి ఉండొచ్చు. ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే..
ప్రస్తుతం కాలేయ(Liver) వ్యాధి సర్వసాధారణమైపోయింది. ఈ రోజుల్లో అన్ని వయసుల వారిలోనూ కాలేయ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. కాలేయ వ్యాధి కాలేయంతోపాటు దాని చుట్టుపక్కల అవయవాలను ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాలలో, ఆల్కహాల్ వల్ల కాలేయ సమస్యలు మొదలవుతాయి. అయితే ఇది కాకుండా, కొవ్వు(Fat) కాలేయ వ్యాధికి చాలా కారణాలు ఉంటాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, హెపటైటిస్, హెమోక్రోమాటోసిస్, ప్రైమరీ బిలియరీ సిర్రోసిస్‌తో సహా అనేక రకాల కాలేయ వ్యాధు ఉన్నాయి. ఈ వ్యాధులన్నీ కాలేయాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి కాలేయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా కడుపులో కింద పేర్కొన్న లక్షణాలను గమనిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే కాలేయం మరింత పాడయ్యే అవకాశం ఉంది.
కాలేయం దెబ్బతిన్న సంకేతాలు..
కాలేయ సంబంధిత సమస్యలలో, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి (NAFLD) కారణంగా కాలేయం దెబ్బతిన్నట్లయితే, దాని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. NAFLD లక్షణాలు సాధారణంగా ఉదరం చుట్టూ కనిపిస్తాయి. ఆరోగ్యం బాగోలేకపోవడం, అలసటగా అనిపించడం ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు. దీనితో పాటు, ఉదరం కుడి వైపున ఉన్న పక్కటెముకల క్రింద నొప్పి లేదా అసౌకర్యం అనిపించడం కూడా కాలేయం దెబ్బతినడానికి సంకేతం.
ఆల్కహాల్ లేని కొవ్వు కాలేయ వ్యాధిలో ఈ లక్షణాలను విస్మరించవద్దు:
ఆకస్మికంగా బరువు తగ్గడం
బలహీనత
కామెర్లు
చర్మం దురద
చీలమండలు, పాదాలు లేదా పొత్తికడుపులో వాపు
కానీ కామెర్లు, చర్మం దురద, వాపు కాలేయ వ్యాధి ప్రారంభ దశలలో జరగదని గుర్తుంచుకోండి. కాలేయం బాగా దెబ్బతిన్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి.
ఒక్కో రోగికి ఒక్కో చికిత్స..
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్న రోగుల చికిత్స వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి డాక్టర్ ప్రత్యేక మందులను సూచిస్తారు. కానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్య మరింత పెరిగితే కాలేయ మార్పిడి చేసే పరిస్థితి ఏర్పడుతుంది.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిలో ఎలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది..
నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న రోగులు బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం, ఎక్కువ నీరు త్రాగడం, రోజూ వ్యాయామం చేయడం, ధూమపానం చేయకపోవడం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్కహాల్ వల్ల కాదు. అయితే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కాబట్టి ఆల్కహాల్ కూడా తీసుకోకండి.
ప్రారంభంలో లక్షణాలు కనిపించవు..
ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లోని లివర్ రీసెర్చ్ హెడ్ ప్రొఫెసర్ జోనాథన్ ఫాలోఫీల్డ్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ డిసీజ్ ఉన్న రోగులు 2030 నాటికి 5 శాతం నుంచి 7 శాతానికి పెరుగుతారని చెప్పారు. చాలా మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉందని తెలియదు. వీరు తరచుగా బయటి నుంచి సన్నగా కనిపించినప్పటికీ వారి కాలేయంలో కొవ్వు కలిగి ఉంటారు. వారి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అలసట కూడా మొదలవుతుంది.