కండరాల తిమ్మిర్లతో ఎక్కువసేపు పనిచేయలేకపోతున్నారా ? అయితే ఇది మీకోసమే!

| Edited By: Ravi Kiran

Aug 12, 2023 | 6:41 AM

ఆరోగ్యంగా జీవించాలంటే శరీరానికి చాలా పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అవసరం. మనం తినే ఆహారం, తాగే పండ్లరసాల ద్వారా అవి సరైన మోతాదులో శరీరానికి అందేలా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ ఎ,బి,సి,డి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలతో పాటు మెగ్నీషియం కూడా చాలా అవసరం. కండరాలు, నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు అనేక రకాల జీవక్రియల..

కండరాల తిమ్మిర్లతో ఎక్కువసేపు పనిచేయలేకపోతున్నారా ? అయితే ఇది మీకోసమే!
Muscle Cramps
Follow us on

ఆరోగ్యంగా జీవించాలంటే శరీరానికి చాలా పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అవసరం. మనం తినే ఆహారం, తాగే పండ్లరసాల ద్వారా అవి సరైన మోతాదులో శరీరానికి అందేలా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ ఎ,బి,సి,డి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలతో పాటు మెగ్నీషియం కూడా చాలా అవసరం. కండరాలు, నరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు అనేక రకాల జీవక్రియల నిర్వహణకు కూడా ఇది సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని నియంత్రించడంలో మెగ్నీషియం ఎంతో దోహదపడుతుంది.

-శరీరంలో మెగ్నీషియం లోపించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని లక్షణాల ద్వారా శరీరంగా మెగ్నీషియం తగ్గిందని గుర్తించవచ్చు.

-అలసట, నీరసం, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆకలి తగ్గిపోవడం, తరచూ వికారం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలు మెగ్నీషియం లోపం కారణంగా కనిపిస్తాయి. గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

-మెగ్నీషియం లోపాన్ని మొదట్లోనే గుర్తిస్తే.. త్వరగా కోలుకోవచ్చు. కొన్నిరకాల ఆహారాలను క్రమం తప్పకుండా తింటే.. ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

-గోధుమలు, పాలకూర, రాగులు, సజ్జలు, తోటకూర, అరటిపండ్లు, సన్ ఫ్లవర్ సీడ్స్, డార్క్ చాక్లెట్, రాజ్మా వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిలో ఏదో ఒకటి తరచూ మీ డైట్ లో ఉండేలా చూసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి