Home Remedies for Burn Injuries: కాలిన గాయాలు త్వరగా తగ్గాలా.. వీటిని ఖచ్చితంగా చేస్తే మాయం అవుతాయ్!

| Edited By: Ravi Kiran

Nov 25, 2023 | 11:20 PM

వంట చేసేటప్పుడు, పూజ చేస్తున్నప్పుడు కాళ్లూ, చేతులూ కాలడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నవి అయితే లెక్క చేయరు కానీ.. పెద్దగా కాలితే మాత్రం చాలా నొప్పిగా ఉంటాయి. బొబ్బలు, ఆపై మచ్చలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో కొంత మంది డాక్టర్ దగ్గరకు వెళ్తే.. మరి కొంత మంది మెడికల్ షాపులో లభ్యమయ్యే మందులతో ఉపశమనం పొందుతారు. ఇంకొంత మంది తమకు తెలిసిన చేతి వైద్యం చేసుకుంటారు. ఏది ఏమైనా ఇలా కాలిన గాయాల..

Home Remedies for Burn Injuries: కాలిన గాయాలు త్వరగా తగ్గాలా.. వీటిని ఖచ్చితంగా చేస్తే మాయం అవుతాయ్!
Burn Injuries
Follow us on

వంట చేసేటప్పుడు, పూజ చేస్తున్నప్పుడు కాళ్లూ, చేతులూ కాలడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నవి అయితే లెక్క చేయరు కానీ.. పెద్దగా కాలితే మాత్రం చాలా నొప్పిగా ఉంటాయి. బొబ్బలు, ఆపై మచ్చలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో కొంత మంది డాక్టర్ దగ్గరకు వెళ్తే.. మరి కొంత మంది మెడికల్ షాపులో లభ్యమయ్యే మందులతో ఉపశమనం పొందుతారు. ఇంకొంత మంది తమకు తెలిసిన చేతి వైద్యం చేసుకుంటారు. ఏది ఏమైనా ఇలా కాలిన గాయాల నొప్పి మాత్రం త్వరగా తగ్గవు. దీంతో వేరే పని చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా ఈ గాయాల నొప్పి తగ్గాలంటే.. ఈ టిప్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఒకసారి లుక్ వేసేయండి.

తడి క్లాత్ తో చుట్టాలి:

కాలిన వెంటనే చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ట్యాప్ కింద పెట్టడం లేదా నీళ్లతో కడగడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నొప్పి అనేవి ఎక్కువ అవ్వడమే కాకుండా బొబ్బలు వస్తాయి. అలా కాకుండా తడి క్లాత్ ని వాటర్ తో తడిపి.. నీళ్లను పిండేసి గాయంపై చుట్టాలి. ఆ తర్వాత మెల్లగా నొక్కి ఉంచితే బొబ్బలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వైట్ వెనిగర్ రాయవచ్చు:

కాలిన గాయంపై ఏది పెట్టాలో తెలియదు. అలాంటప్పుడు వైట్ వెనిగర్ నేరుగా గాయంపై రాయవచ్చు. నార్మల్ వెనిగర్ ఉంటే మాత్రం.. నీటితో కొద్దిగా కలిపి రాయవచ్చు. ఇలా చేస్తే మంట, వాపు అనేవి త్వరగా తగ్గుతాయి.

పెరుగు – పసుపు:

సాధారణంగా అందరి ఇళ్లలో పెరుగు – పసుపు అనేవి ఉంటాయి. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి.. కాలిన గాయాలపై నేరుగా రాయవచ్చు. ఇలా రాయడం వల్ల మంట, నొప్పి, వాపు తగ్గడమే కాకుండా.. గాయం కూడా త్వరగా నయం అవుతుంది.

టూత్ పేస్ట్ ఇలా రాయాలి:

కాలిన వెంటనే టూత్ పేస్ట్ రాస్తూ ఉంటారు. ఇది మంచి పనే అయినప్పటికీ కాలిన గాయంపై వెంటనే టూత్ పేస్ట్ రాయ కూడదు. అలా చేస్తే నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. తడి క్లాత్ తో గాయంపై కాసేపు ఉంచి.. ఆ తర్వాత టూత్ పేస్ట రాయలి. ఇలా చేస్తే మంట పోయి.. చల్లగా ఉంటుంది. అలాగే గాయం కూడా త్వరగా నయం అవుతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.