Brushing Tips: మీకు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే మీకు పళ్ల సమస్యలు గ్యారెంటీ…

ఉదయాన్నే లేవగానే బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ, మరికొంత మందైతే టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేస్తుంటారు. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం ఆహారం తీసుకోవడానికి ముఖ్యంగా అవసరమయ్యే దంతాల సంరక్షణకు ఏం చేయాలి? నిపుణులు దంతాల రక్షణకు ఎలాంటి సూచనలిస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

Brushing Tips: మీకు బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే మీకు పళ్ల సమస్యలు గ్యారెంటీ…
Brushing
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 18, 2023 | 9:00 AM

మారుతున్న కాలమానం ప్రకారం ప్రజలు కొత్తకొత్త అలవాట్లు చేసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో లేట్ పడుకోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల దంత సమస్యలకు కారణమవుతున్నాయి. చాలా మంది ఉదయాన్నే లేవగానే బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ, మరికొంత మందైతే టిఫిన్ చేసిన తర్వాత బ్రష్ చేస్తుంటారు. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం ఆహారం తీసుకోవడానికి ముఖ్యంగా అవసరమయ్యే దంతాల సంరక్షణకు ఏం చేయాలి? నిపుణులు దంతాల రక్షణకు ఎలాంటి సూచనలిస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ తాగడం యువతకు ఓ స్టైల్ గా మారింది. ముఖ్యంగా బుల్లెట్ కాఫీ అంటూ వివిధ రకాలు బెడ్ కాఫీ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇలాంటి అలవాట్ల పంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం సమయంలో నోట్లో తక్కువ లాలా జల ఉత్పత్తి ఉంటుంది. రాత్రంతా నోట్లో పెరుగుతున్న చెడు బ్యాక్టిరియా, బయోఫిల్మ్ వంటి వాటి నిర్మూలనకు కచ్చితంగా ఉదయాన్నే బ్రష్ చేయాల్సిందేనని చెబుతున్నారు. అలాగే దంతాల రక్షణకు కచ్చితంగా పడుకునే ముందు కూడా బ్రష్ చేయాలని చెబుతున్నారు. అది కూడా రాత్రి పూట బష్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. కచ్చితంగా రాత్రి సమయంలో ఆహారం లేదా పానియం తీసుకున్న అరగంట తర్వాత మాత్రమే బ్రష్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నోటిలోని లాలా జలం యాసిడ్ ను నిర్వీర్యం చేసి ఎనామిల్ ను వృద్ధి చేయడానికి సాయం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన దంతాలు కోసం వైద్యుల సూచనను పాటించాల్సిందేనని చెబుతున్నారు. 

దంత రక్షణకు బ్రష్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మన పళ్లకు, నోటికి ఇన్ ఫెక్షన్ రాకుండా ఎలాంటి టూత్ పేస్ట్ కావాలో? నిర్ణయించుకోవాలి. మంచి ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ఎంచుకోవడం ఉత్తమం. ఉదయం నుంచి తీసుకున్న ఆహారం పళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది కాబట్టి రాత్రి సమయంలో బ్రష్ చేసే ముందు కచ్చితంగా ఫ్లాష్ చేయాలి. ఫ్లాస్ చేసేటప్పుడు చాలా సున్నితంగా చేయాలి. ఫ్లాస్ చేసే సమయంలో చిగుళ్ల నుంచి రక్తస్రావం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నోటిని క్రిమి సంహార మౌత్ వాష్ తో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలాగే ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే, అలాగే రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేసుకోవాల్సిందే..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..