Brushing Video: ఎక్కువ సేపు బ్రష్‌ చేస్తున్నారా..? అయితే మీ పళ్లు డేంజర్‌లో ఉన్నట్లే.. మరిన్ని వివరాలు ఈ వీడియో..

Brushing Video: ఎక్కువ సేపు బ్రష్‌ చేస్తున్నారా..? అయితే మీ పళ్లు డేంజర్‌లో ఉన్నట్లే.. మరిన్ని వివరాలు ఈ వీడియో..

Anil kumar poka

|

Updated on: Mar 05, 2022 | 8:48 AM

ఉదయం సాయంత్రం బ్రష్‌ చేయడం పళ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు వైద్య నిపుణులు. తరచూ తమ పేషంట్లకు అదే సూచిస్తుంటారు కూడా. అయితే కొంతమంది గంటల తరబడి బ్రష్ చేస్తుంటారు... మరికొంతమంది రఫ్ బ్రషింగ్ చేస్తారు. ఇది మంచిదికాదంటున్నారు నిపుణులు.


ఉదయం సాయంత్రం బ్రష్‌ చేయడం పళ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు వైద్య నిపుణులు. తరచూ తమ పేషంట్లకు అదే సూచిస్తుంటారు కూడా. అయితే కొంతమంది గంటల తరబడి బ్రష్ చేస్తుంటారు… మరికొంతమంది రఫ్ బ్రషింగ్ చేస్తారు. ఇది మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల చాలా సమస్యలు తలెత్తుతాయంటున్నారు. చాలాసేపు బ్రషింగ్‌ చేయడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతినడమే కాకుండా పళ్లు సెన్సిటివ్‌గా మారిపోయి త్వరగా పుచ్చిపోయే ప్రమాదముందంటున్నారు. హార్డ్‌ బ్రషింగ్‌ వల్ల పళ్లు, చిగుళ్లు కూడా డ్యామేజ్‌ అవుతాయి. అందుకే ఎప్పుడూ మెత్తని బ్రష్‌ను ఉపయోగించమని వైద్యులు చెబుతారు. అలాగే రెండు నెలలకొకసారి టూత్‌ బ్రష్ మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా బ్రషింగ్‌ అనేది కేవలం 2 నుంచి 5 నిమిషాలలోపు ముగించాలని చెబుతున్నారు.చక్కగా మెరిసే దంతాలు ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది చాలా పొరబాటు అంటున్నారు నిపుణులు. దంతాలతో పాటు చిగుళ్లు కూడా చాలా ముఖ్యమని, తరచూ చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే అది జాగ్రత్త పడమని మీకొక హెచ్చరిక అంటున్నారు. గట్టి పదార్ధాలు తినేటప్పుడు నెమ్మదిగా నమలడం మంచిదంటున్నారు. ఇక ఇన్‌ఫ్లమేషన్ కారణంగా చిగుళ్లు పాడవ్వటం సర్వసాధారణమని, అయితే బ్రష్ చేశాక. చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.. ఏదైనా తిన్నాక ఆహారపదార్థాలు పేరుకోకుండా తరచూ పుక్కిలించాలని సూచిస్తున్నారు..ఇక ఎనామిల్ దెబ్బతినకుండా ఉండాలంటే కొన్నింటిని పక్కన పెట్టడం చాలా అవసరం అంటున్నారు. ఇందులో సోడాలు, షుగరీ డ్రింక్స్‌, ఆల్కహాల్, ధూమపానం వంటివాటికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్