Kili Paul viral video: ఇంటర్నెట్ సంచలనం కిలీ పాల్‌కు అరుదైన గౌరవం.. నెటిజన్లు ప్రశంసలు అందుకుంటున్న కిలీ.. వైరల్ వీడియో..
టాంజానియాకు చెందిన ఇంటర్నెట్ సెన్సేషన్ కిలీ పాల్‌ను ఆ దేశంలోని భారత హైకమిషన్ సత్కరించింది. కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ తరచుగా ప్రముఖ బాలీవుడ్ , టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేయడంతోపాటు.. డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇలా ఈ అన్నాచెల్లెలు ..
టాంజానియాకు చెందిన ఇంటర్నెట్ సెన్సేషన్ కిలీ పాల్‌ను ఆ దేశంలోని భారత హైకమిషన్ సత్కరించింది. కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ తరచుగా ప్రముఖ బాలీవుడ్ , టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేయడంతోపాటు.. డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇలా ఈ అన్నాచెల్లెలు .. ఎందరో ప్రముఖుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల వారి డ్యాన్స్‌ను కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా.. సహా చాలా మంది నెటిజన్లు, ప్రముఖులు అభినందించారు. ఇటీవల పుష్ప సినిమాలోని సామి సామి పాటకు కూడా స్టెప్పులేసి.. ఫాలోవర్లను ఫిదా చేశాడు కిలీ పాల్. ఈ క్రమంలో భారత హైకమిషన్ కిలీ పాల్‌ను సత్కరించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కిలీ పాల్ లిప్-సింక్ చేస్తూ షేర్ చేస్తున్న వీడియోలు భారతదేశంలో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాయి అంటూ టాంజానియాలోని భారత హైకమిషన్ బినయ ప్రధాన్ ట్విట్టర్‌లో ఫోటోలను పంచుకున్నారు.కిలీ పాల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. పలువురు ప్రముఖ నటులు సైతం అతనిని ఇన్‌స్టా గ్రామ్‌లో అనుసరిస్తున్నారు. కిలీ జనాదరణ పొందిన బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు లిప్-సింక్ చేసే వీడియోలను, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు మాత్రమే షేర్ చేస్తాడు. కాగా కిలి, నీమా ఇద్దరూ షేర్షా సినిమాలోని రాతన్ లంబియాన్ పాటకు లిప్ సింక్ చేసి.. నెట్టింట వైరల్ అయ్యారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

