AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breastfeeding: పిల్లలకు తల్లిపాలు ఎన్ని రోజులు ఇస్తే మంచిది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదేమిటి..?

Breastfeeding: అమ్మపాలు అమృతం లాంటివి. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు..

Breastfeeding: పిల్లలకు తల్లిపాలు ఎన్ని రోజులు ఇస్తే మంచిది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదేమిటి..?
Subhash Goud
|

Updated on: Nov 26, 2021 | 8:49 AM

Share

Breastfeeding: అమ్మపాలు అమృతం లాంటివి. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా తల్లీ బిడ్డకి మధ్య చక్కని ప్రేమ బంధాన్ని పెంపొందిస్తుంది. బిడ్డ మానసిక ఆరోగ్యం చక్కగా వృద్ధి చెందుతుందని అంటున్నారు వైద్య నిపుణులు.

తల్లిపాలతో కలిగే లాభాలు:

పిల్లలకు ఐదేళ్ల వరకు తల్లిపాలు పట్టిస్తే తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు మరింతగా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. శిశువులు తాగినంత కాలం.. తల్లి ఇవ్వగలిగినంత కాలం తల్లిపాలు పట్టించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) చెబుతోంది. అయితే తల్లిపాలను ఏ వయసు ఆపేయాలన్నదానిపై ఎన్‌హెచ్‌ఎస్‌ నిర్ధష్ట సూచనలు ఏమి చేయలేదు. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత నుంచి ఆరోగ్య కారణాల దృష్ట్యా తల్లిపాలతోపాటు ఘన పదార్థాలు తినిపించాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

తల్లిపాలతో ఇన్ఫెక్షన్లు దూరం..

తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు ఇన్‌ఫెక్షన్ల నుంచి, రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల దూరం రక్షించుకోవచ్చు. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. శిశువు రెండో సంవత్సరంలోకి వచ్చాక, తల్లిపాలు ఇవ్వడంతోపాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని ఎన్‌హెచ్‌ఎస్ వెబ్‌సైట్ చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాటేమిటి?

రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. రెండు సంవత్సరాల తర్వాత కూడా తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు పోషకాలపరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పలేమని, ఇలా చెప్పేందుకు ఆధారాలు పరిమితంగా ఉన్నాయని లండన్‌లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్’కు చెందిన వైద్యులు చెబుతున్నారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి శిశువుకు కావాల్సిన పోషకాలు శిశువు తీసుకొనే ఇతర ఆహారంతో అందాలని పేర్కొంటున్నారు.

పాలు పట్టించడాన్ని కొనసాగించాలా, వద్దా..?

పాలు పట్టించడాన్ని కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయాన్ని చాలా అంశాల ప్రాతిపదికగా మహిళలు నిర్ణయించుకుంటారు. పాలు ఇవ్వడంలో సౌకర్యం, అసౌకర్యం, కుటుంబ సభ్యులు, తిరిగి ఉద్యోగ విధుల్లో చేరాల్సి ఉండటం, తదితర కారణాలను బట్టి వారు నిర్ణయానికి వస్తారు. బ్రిటన్‌లో శిశువు పుట్టాక దాదాపు 80 శాతం మంది మహిళలు కొన్ని వారాలపాటు పాలు ఇస్తారు. తర్వాత చాలా మంది ఆపేస్తారు.

ఇవి కూడా చదవండి:

Onions Benefits: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ఏమవుతుంది..? పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

Camels: ఒంటెలు నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి.. వాటి కనురెప్పల ప్రత్యేకత ఏమిటి? .. ఎన్నో ఆసక్తికర విషయాలు?

Climate Change: పక్షుల రెక్కలు పెరగడం.. తగ్గడంపై వాతావరణ మార్పుల ప్రభావం.. పరిశోధనలలో సంచలన విషయాలు

Breathing: పిల్లలు, పెద్దలు నిమిషంలో ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటారు?.. సాధారణ శ్వాసరేటు ఎంత ఉండాలి..!

Follow Us
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ