AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? నిపుణులు ఏమంటున్నారు..?

Blueberries Vs Guava: బ్లూబెర్రీస్ చాలా “ప్రీమియం” ఫుడ్‌గా ప్రాముఖ్యత పొందినప్పటికీ.. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా దీనిపై కొన్ని ప్రత్యేక విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన తన కొత్త వీడియోలో జామపండు ఎలా బ్లూబెర్రీల కంటే ఎక్కువ పోషకాలతో ఉన్నదో వివరించారు.

బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? నిపుణులు ఏమంటున్నారు..?
Blueberries vs Guava
Rajashekher G
|

Updated on: Feb 09, 2026 | 12:27 PM

Share

ఇటీవల కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనేక రకాల ఆరోగ్య కథనాలతో కొంత గందరగోళానికి గురవుతున్నారు. మీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ ఇవే అంటే చాలా పదార్థాలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో బ్లూబెర్రీలు ఒకటి. బ్లూబెర్రీస్ చాలా “ప్రీమియం” ఫుడ్‌గా ప్రాముఖ్యత పొందినప్పటికీ.. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా దీనిపై కొన్ని ప్రత్యేక విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన తన కొత్త వీడియోలో జామపండు ఎలా బ్లూబెర్రీల కంటే ఎక్కువ పోషకాలతో ఉన్నదో వివరించారు. డాక్టర్ వోరా, రెండు పండ్ల ధరలను పోల్చి, బ్లూబెర్రీలు “ఫ్యాన్సీ”గా ప్యాక్ చేసినప్పటికీ.. వాటి పోషక విలువలు నిజంగా ఎక్కువవా అనేది విశ్లేషించారు.

బ్లూబెర్రీ vs జామ

“కిలో రూ. 2000 ఖరీదు చేసే బ్లూబెర్రీస్ తినడం కంటే.. మీరు రూ. 100/కిలో జామ తినడం మంచిదిదని డాక్టర్ వోరా చెబుతున్నారు. బ్లూబెర్రీలు ఓట్స్, షేక్స్, సలాడ్లలో ఎక్కువ కనిపిస్తాయి. కానీ పోషకాల పరంగా జామపండు వాటిని మించి ఉంటుంది అని ఆయన చెప్పారు.

విటమిన్ C

జామపండులో బ్లూబెర్రీల కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ C ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తికి, చర్మ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది.

ఫైబర్

బ్లూబెర్రీస్ కంటే జామపండులో రెట్టింపు ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

గ్లైసెమిక్ సూచిక

జామపండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. కాబట్టి చక్కెర ఎక్కువగా పెరగదు. ఇది మధుమేహం ఉన్నవారికి ఉపయోగకరం.

యాంటీఆక్సిడెంట్లు

బ్లూబెర్రీల్లో ఉండే ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు (ఆంథోసైనిన్‌లు) గుండె, రక్తనాళాల ఆరోగ్యం, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. జామపండ్లలో ఇవి ఉండవు.

బ్లూబెర్రీలు ప్రత్యేక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నప్పటికీ.. జామపండ్లు రోజువారీ ఆహారంలో చేర్చడానికి ఉత్తమం. అవి ఎక్కువ విటమిన్ C, ఫైబర్, ఇతర విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెరను, జీర్ణక్రియను మద్దతు ఇస్తాయి. అంతేకాదు, దేశంలోని చాలా ప్రాంతాల్లో అవి తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. అందుకే ఖరీదైన బ్లూ బెర్రీస్ కంటే తక్కువ ధరలోని జామపండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని డాక్టర్ వోరా చెబుతున్నారు.

Follow Us