AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Cumin: నల్ల జీలకర్రను ఇలా తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజాలు.. అధిక బరువు సైతం మాయం..

దేశంలో జీలకర్రను ఉపయోగించని వంటగది లేదంటే అతిశయోక్తి లేదు. జీలకర్ర ఆహార రుచిని పెంచుతుంది. అంతేకాదు.. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Black Cumin: నల్ల జీలకర్రను ఇలా తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజాలు.. అధిక బరువు సైతం మాయం..
Black Cumin
Shiva Prajapati
|

Updated on: Nov 04, 2022 | 6:12 AM

Share

దేశంలో జీలకర్రను ఉపయోగించని వంటగది లేదంటే అతిశయోక్తి లేదు. జీలకర్ర ఆహార రుచిని పెంచుతుంది. అంతేకాదు.. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చలికాలంలో మనుషుల్లో రోగనిరోధక శక్తి సాధారణంగా తగ్గిపోతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీలకర్ర శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఉదర సంబంధిత సమస్యలు నయమవుతాయి. దీంతో పాటు, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీలకర్రలో నల్ల జీలకర్ర చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణ జీలకర్ర కంటే ఎక్కువ ప్రయోజనకరమైనదని రుజువైంది. నల్ల జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె సమస్యకు చెక్..

నల్ల జీలకర్ర గుండెకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. గుండె సమస్యలతో బాధపడేవారు దీని నూనెను వేడి నీళ్లలో లేదా టీలో కలుపుకుని తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

బరువు తగ్గడం..

నల్ల జీలకర్ర బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు. దీని నూనెలో తేనె, వేడి నీళ్లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. దీంతో ఊబకాయం సమస్యను దూరం చేసుకోవచ్చు.

చర్మ ఆరోగ్యం కోసం..

చర్మం, మొటిమల సమస్యలు ఉంటే.. నల్ల జీలకర్ర రసాన్ని నిమ్మరసంలో కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. మొటిమలు కూడా తగ్గిపోతాయి. సరికాని జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా.. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు కడుపునొప్పి, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నల్ల జీలకర్ర నీరు ఈ సమస్యలను తొలగిస్తుంది. దీని వినియోగం జీవక్రియను బలపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కొవ్వును కరిగిస్తుంది..

జీర్ణక్రియలో సమస్య ఏర్పడినప్పుడు.. శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోతుంది. దాని కారణంగా, శరీర బరువు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. నల్ల జీలకర్ర కొవ్వును కరిగించి, ప్రేగు కదలికల ద్వారా బయటకు పంపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

నల్ల జీలకర్ర నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక వ్యక్తికి జలుబు, ఇతర ఏవైనా సమస్యలుంటే నల్ల జీలకర్ర తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. కోరింత దగ్గు, బ్రోన్కైటిస్, అలెర్జీ వంటి శ్వాసకోశ వ్యాధులకు వ్యతిరేకంగా ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..