ఇవి తింటే ఒంట్లో ఉన్న చెత్తంతా పోతుంది.. బరువు కూడా ఈజీగా తగ్గుతారు
శరీర బరువు నియంత్రణ అనేది జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన అంశం. అందుకు సరైన ఆహారపు అలవాట్లు అవసరం. ముఖ్యంగా కొన్ని సహజ విత్తనాలు బరువు తగ్గించడంలో సహకరిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాల్ని అందించడమే కాక కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వాటిలో ప్రధానమైన కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చియా విత్తనాలు పీచుపదార్థం అధికంగా కలిగి ఉంటాయి. ఇవి నీటిని శోషించడంతో కడుపు నిండినట్టు అనిపిస్తుంది. తద్వారా ఎక్కువగా తినకుండా నియంత్రించుకోవచ్చు. అంతేకాదు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల కొవ్వు కరిగే చర్యల్ని వేగవంతం చేస్తాయి. రోజు ఒక్క స్పూన్ చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
అవిసె గింజలు మన శరీరాన్ని శుభ్రం చేయడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే పోషకాల వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. అలా జరిగితే శరీరం తేలికగా అనిపిస్తుంది. బరువు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో అవిసె గింజలు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
గుమ్మడికాయ గింజల్లో ప్రోటీన్, మంచి కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. అధికంగా ఆకలి అనిపించకుండా చూస్తాయి. దీంతో తక్కువగా తినే అలవాటు వస్తుంది. దీనివల్ల రోజు రోజుకు బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. పైగా చర్మం మెరుస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది.
నువ్వులు చిన్నవైనప్పటికీ శక్తివంతమైన పోషకాల్ని కలిగి ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి అవసరం అయినవే. ఇవి కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడతాయి. అలాగే ఎముకల బలానికి తోడ్పడతాయి. ప్రతిరోజూ తక్కువ మోతాదులో నువ్వులు తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి.
పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఖనిజాలు, ప్రోటీన్లు శరీరానికి శక్తిని ఇస్తాయి. దీని వల్ల చురుకుతనం పెరుగుతుంది.
సబ్జా గింజలు నీళ్లలో వేస్తే ఉబ్బుతాయి. వాటిని తిన్న తర్వాత చాలాసేపు కడుపు నిండినట్టు ఉంటుంది. దానివల్ల తక్కువ తింటాం. వాటిలో పీచు ఎక్కువ ఉండటం వల్ల జీర్ణం బాగా అవుతుంది. ఇది బరువు తగ్గడానికి తొందరగా సహాయం చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)