AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar : నేను ఎన్ని సినిమాలు చేసినా ఆ మూవీ అంటే చాలా ఇష్టం.. కానీ ప్లాప్ అయ్యింది ఎందుకో.. సుకుమార్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఆయనను అభిమానులు క్రియేటివ్ డైరెక్టర్ అని, లెక్కల మాస్టారు అని పిలుచుకుంటారు. ఆర్య సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సుకుమార్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదిచుకున్నారు.

Sukumar : నేను ఎన్ని సినిమాలు చేసినా ఆ మూవీ అంటే చాలా ఇష్టం.. కానీ ప్లాప్ అయ్యింది ఎందుకో.. సుకుమార్..
Sukumar
Rajitha Chanti
|

Updated on: May 30, 2026 | 6:51 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘క్రియేటివ్ డైరెక్టర్’ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు సుకుమార్. తన విలక్షణమైన కథనాలతో, విభిన్నమైన క్యారెక్టరైజేషన్లతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేసిన సుకుమార్, వెండితెరపై సినిమాల లెక్కలను కూడా మార్చేశారు. తన తొలి చిత్రం ‘ఆర్య’ తోనే ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటివరకు వన్-సైడ్ లవ్ అంటే కేవలం హీరో మాత్రమే ప్రేమించడం అనే కాన్సెప్ట్‌ను కాదని, “ఫీల్ మై లవ్” అంటూ తన ప్రేమను వ్యక్తపరిచే సరికొత్త సైకాలజీని చూపించారు. సినిమాలో కేవలం హింస మాత్రమే కాకుండా, కథనంలో ఉండే ఎమోషన్ ఎంతో ముఖ్యమని ఆయన నమ్ముతారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఈ ఇంటర్వ్యూలో సుకుమార్ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత ఆలోచనలను, ఫిలాసఫీని కూడా పంచుకున్నారు. మనిషి శారీరక స్థితి (Physical status) కన్నా మానసిక స్థితి (Psychological status) చాలా కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. మనం తీసుకునే ఆహారం, మన ఆలోచనలు మన శరీరాన్ని పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని సుకుమార్ వివరించారు. ముఖ్యంగా లో-ఫ్యాట్, లో-క్యాలరీ ఉండే ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తూనే, అది రుచిగా కూడా ఉండేలా చూసుకోవడం తన లైఫ్‌స్టైల్‌లో ఒక భాగమని సరదాగా పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

‘ఆర్య’ నుంచి నిన్నటి ‘పుష్ప’ వరకు సుకుమార్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక లోతైన మనస్తత్వం ఉంటుంది. ఒక సినిమా ప్లాప్ అయినా కూడా (ఉదాహరణకు జగడం సినిమా తర్వాత) పరిశ్రమలోని తోటి దర్శకులు, రాజమౌళి వంటి వారు తనకు ఎలా మద్దతుగా నిలిచారో ఆయన గుర్తుచేసుకున్నారు. ఏ సినిమా చేసినా దాని వెనుక వంద శాతం కష్టాన్ని పెట్టడమే ఒక దర్శకుడిగా తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. కమర్షియల్ సక్సెస్‌తో పాటు కథలో ఉండే లాజిక్, క్రియేటివిటీలను సమపాళ్లలో మిక్స్ చేయడమే సుకుమార్ ప్రత్యేకత.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us