Nasal Congestion Tips: వింటర్ సీజన్ లో ముక్కు దిబ్బడ నుంచి ఇలా ఉపశమనం పొందండి!

| Edited By: Ram Naramaneni

Nov 02, 2023 | 9:51 PM

సాధారణంగా వర్షా కాలం, చలి కాలంలో ముక్కు దిబ్బడ సమస్య వేధిస్తూ ఉంటుంది. ముక్కు పట్టేసి మాట్లాడటానికి, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది గా ఉంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్నా తొందరగా తగ్గదు. ఇది ఎంత బాధిస్తుందో.. అనుభవించిన వారికే తెలుస్తుంది. ముక్కు పట్టేయడం వల్ల తల నొప్పి కూడా వస్తుంది. దుమ్ము, ధూళి, కొన్ని రకాల ఆహార పదార్థాలు, పుప్పొడి, పొగ, నాసికా లైనింగ్ వాపు వల్ల ముక్కు దిబ్బడ వస్తుంది. అయితే ముక్కు దిబ్బడను నయం చేయడం ఈ..

Nasal Congestion Tips: వింటర్ సీజన్ లో ముక్కు దిబ్బడ నుంచి ఇలా ఉపశమనం పొందండి!
Nasal Congestion
Follow us on

సాధారణంగా వర్షా కాలం, చలి కాలంలో ముక్కు దిబ్బడ సమస్య వేధిస్తూ ఉంటుంది. ముక్కు పట్టేసి మాట్లాడటానికి, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది గా ఉంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్నా తొందరగా తగ్గదు. ఇది ఎంత బాధిస్తుందో.. అనుభవించిన వారికే తెలుస్తుంది. ముక్కు పట్టేయడం వల్ల తల నొప్పి కూడా వస్తుంది. దుమ్ము, ధూళి, కొన్ని రకాల ఆహార పదార్థాలు, పుప్పొడి, పొగ, నాసికా లైనింగ్ వాపు వల్ల ముక్కు దిబ్బడ వస్తుంది. అయితే ముక్కు దిబ్బడను నయం చేయడం ఈ చిట్కాలు బాగా హెల్ప్ అవుతాయి. మరి అవేంటో ఓ లుక్ వేసేయండి.

ఆవిరి పీల్చడం:

ముక్కు పట్టేసినా, జలుబు, గొంతు నొప్పి ఇవి ఏం ఉన్నా ఆవిరి పట్టడం వల్ల మంచి రిలీఫ్ దొరుకుతుంది. వేడి నీటిలో రెండు, మూడు చుక్కల యూకలిప్టస్ లేదా పుదీనా నూనె యాడ్ చేసి పీల్చితే.. ఆ ఘాటు వాసనకు నాసికా మార్గాలు తెరచుకుని ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపు పాలు:

పసుపు పాలను తాగడం వల్ల కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. పసుపులో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నాసికా మార్గాలు తెరుచుకునేలా చేస్తుంది.

అల్లం టీ:

చలి కాలంలో అల్లం టీ తాగడం వల్ల ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అల్లంలో యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి సైనస్ లను క్లియర్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా మెరుగు పరుస్తుంది.

తులసి టీ:

తులసిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ బయోటిక్స్ కూడా ఉంటాయి. ముక్కు పట్టేసినప్పుడు తులసి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులు మూసుకు పోయిన నాసికా మార్గాలను తెరుస్తుంది. అలాగే వాపును కూడా తగ్గిస్తుంది.

ఆయుర్వేద మూలికలు:

అల్లం, పొడవాటి మిరియాల, నల్ల మిరియాలు కలిపిన త్రికటు చూర్ణం కలిపి తీసుకుంటే ముక్కు దిబ్బడ నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా చలి కాలంలో శరీరంలో వేడిని పెంచుతుంది.

యోగా:

కొన్ని రకాల యోగా ఆసనాలు, వ్యాయామాల వల్ల కూడా శ్వాస కోశ సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, మూసుకు పోయిన నాసికా మార్గాలు తెరుచుకుంటాయి. కపాలభతి, అనులోమ్ విలోమ్ వంటి శ్వాస వ్యాయామాలు చాలా హెల్ప్ చేస్తాయి.

గమనిక: ఇది ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు నిపుణులను సంప్రదించడం మేలు.