Pink Salt Benefits: గ్యాస్, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఉప్పు వాటర్ తో చెక్ పెట్టండి!

| Edited By: Ravi Kiran

Nov 22, 2023 | 10:55 PM

ఉప్పు లేనిదే ఆహారానికి రుచి ఉండదు. అందుకే ఆహారాల్లో ఏమి వేసినా వేయకపోయినా.. ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేస్తారు. మిగతా వాటికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కానీ.. ఉప్పుకి మాత్రం లేదు. ఉప్పుతో సైడ్ ఎఫెక్ట్సే కాదు.. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఉప్పును ఎక్కువగా తీసుకుంటే హానికరమని మరోవైపు వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. తెల్ల ఉప్పు బదులు.. పింక్ సాల్ట్ ని ఉపయోగిస్తే బోలెడు లాభాలు కూడా ఉన్నాయి. పింక్ సాల్ట్ లో ఆయుర్వేద గుణాలు చాలా ఉంటాయి. వీటితో పలు రకాల సమస్యలకు..

Pink Salt Benefits: గ్యాస్, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. ఉప్పు వాటర్ తో చెక్ పెట్టండి!
pink salt
Follow us on

ఉప్పు లేనిదే ఆహారానికి రుచి ఉండదు. అందుకే ఆహారాల్లో ఏమి వేసినా వేయకపోయినా.. ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేస్తారు. మిగతా వాటికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కానీ.. ఉప్పుకి మాత్రం లేదు. ఉప్పుతో సైడ్ ఎఫెక్ట్సే కాదు.. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఉప్పును ఎక్కువగా తీసుకుంటే హానికరమని మరోవైపు వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. తెల్ల ఉప్పు బదులు.. పింక్ సాల్ట్ ని ఉపయోగిస్తే బోలెడు లాభాలు కూడా ఉన్నాయి. పింక్ సాల్ట్ లో ఆయుర్వేద గుణాలు చాలా ఉంటాయి. వీటితో పలు రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి పింక్ సాల్ట్ తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది:

సాధారణంగా ఉండే తెల్ల ఉప్పు కంటే.. గులాభి రంగులో ఉండే ఉప్పును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ఎక్కువగా దక్షిణి భారతీయులు ఉపయోగిస్తారు. సాధారణంగా ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణం కాకపోతే కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వారు వరుసగా పింక్ సాల్ట్ కలపిని గోరు వెచ్చటి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం కనిపస్తాంది. అంతే కాకుండా జీర్ణ క్రియ కూడా బలంగా మారుతుంది. అంతే కాకుండా పొట్ట నొప్పి, పొట్టలో మంట వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా ఈ నీటిని తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

కీళ్ల నొప్పులు:

చాలా మందికి చలి కాలంలో కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇలాంటి వారికి పింక్ సాల్ట్ బాగా సహాయ పడుతుంది. కీళ్ల నొప్పులు ఉన్ చోట.. రాక్ సాల్ట్ తో కట్టు కట్టినా.. కాపడం పెట్టినా మంచి ఫలితాలు కనిపస్తాయి.

చర్మ సమస్యలు:

చాలా మంది పలు రకాల చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఉప్పును తరచుగా ఉపయోగిస్తూ ఆ సమస్యలు దూరం అవుతాయి.

చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి:

పింక్ కలర్ సాల్ట్ ని టూత్ పౌడర్ లా కూడా వినియోగించవచ్చు. దీని వల్ల చిగుళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే పళ్లు కూడా తెల్లగా మారతాయి. చిగుళ్ల నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.