AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Problem Tips: మధుమేహ బాధితులకు గుడ్ న్యూస్.. ప్రతిరోజూ ఆహారంలో ఇవి చేర్చుకుంటే షుగర్ బాధ తీరిపోయినట్లే

వైద్యుల సలహా మేరకు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఆహార అలవాట్ల కారణంగా కూడా కొంతమేర షుగర్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Sugar Problem Tips: మధుమేహ బాధితులకు గుడ్ న్యూస్.. ప్రతిరోజూ ఆహారంలో ఇవి చేర్చుకుంటే షుగర్ బాధ తీరిపోయినట్లే
Millets Health BenefitsImage Credit source: TV9 Telugu
Nikhil
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 19, 2023 | 3:59 PM

Share

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా షుగర్ సమస్య అందరినీ వేధిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటే షుగర్ కింద భావిస్తారు. అనారోగ్య ఆహార అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల షుగర్ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే షుగర్ కు వివిధ వ్యాధులు కలిస్తే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో షుగర్ లెవెల్స్ సాధారణ స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వైద్యుల సలహా మేరకు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా ఆహార అలవాట్ల కారణంగా కూడా కొంతమేర షుగర్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని షుగర్ రోగులు తగ్గించాలి. అలాగే పిండి పదార్థాలను తినే విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. కాబట్టి షుగర్ ను తగ్గించడానికి నిపుణులు సూచించే ఆ ఆహార పదర్థాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

షుగర్ వ్యాధిగ్రస్తులు తినాల్సిన తృణధాన్యాలు ఇవే

బార్లీ 

బార్లీ గింజల్లో బీటా- గ్లూకాన్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సాయం చేస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను బార్లీ గింజలు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వోట్స్

వోట్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ ప్రక్రియలో బాగా సాయం చేస్తాయి. అలాగే మెగ్నీషీయంతో పాటు ఇతర ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా నియంత్రిస్తాయి. 

ఇవి కూడా చదవండి

ఉసిరికాయ

ఇతర తృణధాన్యాలతో పోలిస్తే ఉసిరికాయలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు రోజూ తమ ఆహారంలో ఉసిరి చేర్చుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

రాగి

రాగి చాలా పోషకమైన మిల్లెట్ అని వైద్యుల అభిప్రాయం. ఎందుకంటే రాగి అధిక చక్కెరను మాత్రమే అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి కూడా దివ్యఔషధంగా పని చేస్తుందని నిపుణుల మాట. కాబట్టి రోజూ రాగిపిండితో చేసిన ఆహారాన్ని తింటే చాలా మేలు చేస్తుంది. 

బజ్రా

ఇది అధిక ఫైబర్ ఉండే ఆహారం. అలాగే ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో ఉంటుంది. బజ్రా మధుమేహం ఉన్నవారికి చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్ధకంతో బాధపడేవారు కూడా డైలీ బజ్రాతో చేసిన ఆహారం తినాలని చెబుతున్నారు. ఇందులో ఉండే హై ఐరన్ శాతం శరీరానికి చాలా మేలు చేస్తుంది.

జొన్నలు

జొన్నల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం లో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా పని చేస్తుంది. అలాగే శరీరీంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువు తగ్గడంలో కూడా సాయం చేస్తుంది. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి