Sugar Patient Problems: షుగర్ వ్యాధిగ్రస్తులకు షాక్..ఈ సమస్య ఉంటే కంటి చూపు కోల్పోయే ప్రమాదం
గర్ ఉన్న వారు దృష్టంతా షుగర్ తగ్గించడంపైనే పెడుతుంటారు. కానీ ఇతర సమస్యలు వస్తున్నా పెద్దగా పట్టించుకోరు. షుగర్ వ్యాధిగ్రస్తులకు కళ్లు పొడిబారితే పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసమస్యను పట్టించుకోకపోతే ఏకంగా కంటి చూపే కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
సహజంగా మధమేహ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటూ షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ షుగర్ కంట్రోల్ అవ్వడం లేదని బాధపడుతుంటారు. షుగర్ ఉన్న వారు దృష్టంతా షుగర్ తగ్గించడంపైనే పెడుతుంటారు. కానీ ఇతర సమస్యలు వస్తున్నా పెద్దగా పట్టించుకోరు. షుగర్ వ్యాధిగ్రస్తులకు కళ్లు పొడిబారితే పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కంటి సమస్యను పట్టించుకోకపోతే ఏకంగా కంటి చూపే కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీన్ని వైద్య పరిభాషలో డ్రై ఐ సిండ్రోమ్ అంటారని పేర్కొంటున్నారు.
షుగర్ వ్యాధిగ్రస్తుల కళ్లు పొడిగా మారడం, అలాగే కనీళ్లు కూడా రాకపోతే దాన్ని డ్రై ఐ సిండ్రోమ్ గా గుర్తిస్తారు. ఈ సమస్యతో బాధపడే వారికి విపరీతంగా కంటి మంటలు వస్తుంటాయి. కానీ నీరు కారదు. క్రమేపి ఇది కంటి చూపుపై ప్రభావం చూపిస్తుందని నిపుణుల వాదన. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారికి ఈ సమస్య సంభవిస్తుంది. షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగినప్పుడే ఈ పరిస్థితికి దారి తీస్తుంది. అధిక షుగర్ కారణంగా కంటి నరాలు దెబ్బతినడంతో కళ్లు ఉత్పత్తి చేసే కనీళ్లపై ప్రభావం పడుతుంది.
వీరికే అసలు సమస్య
డ్రై ఐ సిండ్రోమ్ తో బాధపడేవారు మొదటగా కంటి వాపును అనుభవిస్తారు. కళ్లల్లో కన్నీళ్లు సృష్టించే లాక్రిమల్ గ్రంధులు దెబ్బతినడంతో ఈ సమస్య వస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రమవుతుంది. 65 ఏళ్లు పైబడిన షుగర్ వ్యాధిగ్రస్తులు 15-33 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా ఏడాదికి ఓ సారైనా కంటి పరీక్షలు చేసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
డ్రైఐ సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స
డ్రైఐ సిండ్రోమ్ తో బాధపడేవారు కళ్లు ఎర్రబడడం, కళ్లల్లో దురద, కళ్లల్లో మంట, ఒత్తిడికి గురైనట్లు అనిపించడం, మబ్బుమబ్బుగా కనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యకు ప్రధాన చికిత్స షుగర్ ను కంట్రోల్ చేసుకోవడమే. అవును షుగర్ ను లెవెల్స్ ను స్టెబిలైజ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ కంట్రోల్లో ఉన్నా ఇదే సమస్య మళ్లీ ఉత్పన్నమైతే కంటి వైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స ప్రారంభిస్తారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి