Beauty Tips: అందమైన పాదాల కోసం గ్రీన్ టీ.. ఇలా చేసి చూడండి..!
Beauty Tips: కరోనా వచ్చినప్పటి నుంచి గ్రీన్ టీ అందరు తాగుతున్నారు. బరువు తగ్గించుకునే వ్యక్తులు కూడా గ్రీన్ టీపై ఆధారపడుతున్నారు. గ్రీన్ టీలో
Beauty Tips: కరోనా వచ్చినప్పటి నుంచి గ్రీన్ టీ అందరు తాగుతున్నారు. బరువు తగ్గించుకునే వ్యక్తులు కూడా గ్రీన్ టీపై ఆధారపడుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఒక్కరోజులో 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీ తాగితే గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా తగ్గిస్తుంది. చర్మం నిగారింపును మెరుగు పరుస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. గాయాల నుంచి చర్మం కోలుకునేలా సహకరిస్తుంది. అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. ముడతలను, మంటను తగ్గిస్తుంది. అయితే గ్రీన్ టీ పాదాలని అందంగా చేస్తుందని చాలా మందికి తెలియదు. అందమైన పాదాల కోసం గ్రీన్ టీని ఇలా వాడి చూడండి.
ఒక బకెట్‌లో గోరువెచ్చని నీరు తీసుకోండి. అందులో నాలుగు గ్రీన్ టీ బ్యాగ్‌లని వేయండి. టీ బ్యాగులు నీళ్లలో కలిసిపోయే లోపు కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడగండి. అలాగే బకెట్‌లో కొంచెం ఉప్పు కలపండి. తర్వాత పాదాలని 10 నుంచి 15 నిమిషాలు బకెట్‌లో ఉంచండి. తర్వాత బాగా రుద్దండి. దీంతో చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత పాదాలకి మంచి మాయిశ్చరైజర్‌ను రుద్దండి. తరచుగా ఇలా చేస్తే పాదాలు అందంగా మెరుస్తాయి.
గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్
గ్రీన్ టీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే గ్రీన్ టీని తగు మోతాదులో తీసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం రోజుని ఒక కప్పు గ్రీన్ టీతో మొదలు పెట్టండి. ఏదైనా పరిమితిలో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అనర్థాలకి దారి తీస్తుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.