Health Tips: ఈ ఆహారాలతో ఆయుష్షు పెంచుకోవచ్చు.. ఈ డైట్ మెయింటెన్ చేస్తే సాధ్యమే..!
Health Tips: నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది.
Health Tips: నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది. జీవన విధానం, ఆహారశైలిలో మార్పులు చేస్తే కచ్చితంగా వందేళ్లు బతకవచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలని తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం బతకవచ్చు. పీఎల్‌ఓఎస్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఇందులో ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆయుష్షు పెంచుకోవచ్చో సూచించారు. దీని ప్రకారం కొన్ని రకాల ఆహారాలని తీసుకుంటే పురుషులు 13 ఏండ్ల వరకు.. మహిళలు 10 సంవత్సరాల వరకు జీవితకాలం పెంచుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
అధ్యయనం ప్రకారం ఒక మహిళ తన 20 ఏండ్ల వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే.. తన జీవిత కాలాన్ని 10 సంవత్సరాలు పెంచుకోవచ్చు. అలాగే ఒక పురుషుడు తన జీవిత కాలాన్ని13 సంవత్సరాలు పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం వృద్ధుల జీవిత కాలాన్ని కూడా పొడిగిస్తుందని ఈ అధ్యయనంలో తేల్చారు. ప్రతిరోజు తినే ఆహారాలలో పచ్చి ఆకుకూరలు, కూరగాయలు క్రమం తప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే 80 ఏండ్ల వృద్ధుడు కూడా 3.5 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చని చెబుతున్నారు. దీర్ఘాయుష్షు కోసం చిక్కుళ్ళు.. ముఖ్యంగా బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు తీసుకోవాలి. తృణధాన్యాలే కాకుండా వాల్ నట్స్, బాదం, పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆకులు, ధాన్యపు ఆహారాలు ఎక్కువ కాలం జీవించడానికి దోహదం చేస్తాయని అధ్యయనంలో చెప్పారు. నార్వేకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.