Cardamom Benefits: యాలకులలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Cardamom Benefits: యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి అని పిలుస్తుంటారు. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో

Cardamom Benefits: యాలకులలో అద్భుత ఔషధ గుణాలు.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Cardamom
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Apr 19, 2022 | 7:19 AM

Cardamom Benefits: యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి అని పిలుస్తుంటారు. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా వాడుతారు. వాస్తవానికి యాలకుల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీటిని సాగు చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఎంత ఎక్కువ ధర ఉన్నా జనాలు వీటిని కచ్చితంగా కొనుగోలు చేస్తారు. దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో ఇవి కచ్చితంగా ఉంటాయి. వీటిని టీ నుంచి మొదలుకొని వివిధ రకాల స్వీట్లు, వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. యాలకుల్లో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను పొగొడుతుంది. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

1. నోటి దుర్వాసనకి చెక్

యాలకులు నోటి దుర్వాసనని పోగొడుతాయి. దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఒక ఇలాచి నోట్లో వేసుకొని నెమ్మదిగా నమలాలి. ఇందులో ఉండే గుణాలు నోటి దుర్వాసనని వెదజల్లుతాయి.

2. బరువు తగ్గిస్తుంది

యాలకులు జీవక్రియను పెంచుతాయి. దీంతో కొవ్వు తొందరగా కరుగుతుంది. యాలకుల నీరు, కొవ్వు నిల్వలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో సులువుగా బరువు తగ్గవచ్చు.

3. శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. కొన్నిసార్లు అంగస్తంభనను కూడా నయం చేస్తుంది. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతాయి. కండరాలు బాగా పని చేసేలా చేస్తాయి.

4. బీపీని కంట్రోల్ చేస్తుంది

యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు బీపీని కంట్రోల్‌ చేయడంలో సహాయపడుతాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి.

5. డిప్రెషన్‌ తగ్గిస్తుంది

యాలకులలలో ఉండే లక్షణాలు మానసిక ఒత్తిడి, నిరాశతో బాధపడుతున్న వ్యక్తుల మూడ్‌ని మార్చుతాయి. ప్రతిరోజు టీలో వేసుకొని తాగితే గొప్ప ఫలితాలు ఉంటాయి.

6. ప్రశాంతమైన నిద్ర

ప్రశాంతమైన నిద్ర కోసం, మీ నిద్రవేళ పాలలో చిటికెడు యాలకులు పసుపు ,నల్ల మిరియాలు కలపండి.

7. జలుబు, దగ్గు సమస్యలకి చెక్

జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు నల్ల యాలకులు వాడడం మంచిది. ఆందోళన, వికారం వంటి సమస్యలను నియంత్రిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

LSG vs RCB Prediction Playing XI IPL 2022: కేఎల్‌ రాహుల్‌ ఈ బౌలర్‌ని తప్పించవచ్చు.. డు ప్లెసిస్ మార్పులు చేసే అవకాశం లేదు..!

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పథకం కింద చేసే పనులకి డైరెక్ట్‌గా చెల్లింపులు..!

IPL 2022 వేలంలో అతడిని ఎవరూ కొనాలనుకోలేదు.. కానీ ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే..!

వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..