నలభై ఏళ్ల తర్వాత చాలా మంది మహిళలు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటారు. నిరంతర వెన్నునొప్పి వేధిస్తుంటుంది. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు వయస్సు పైబడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంటుంది. సాధారణంగా 40 ఏళ్ల వయస్సులో మహిళలు వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటుంటారు. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు వెన్నునొప్పితో బాధపడుతుంటారు. అసలు మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందంటే..
మీరు 40 ఏళ్ల తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే, దాని నుండి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…
వెన్నునొప్పి సమస్యను తగ్గించుకోవడానికి రోజూ చిన్న పాటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఏరోబిక్ ట్రైనింగ్, ఎనర్జీ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ వంటి వ్యాయామాలు చేయడం ముఖ్యం. వారానికి కనీసం 3 నుంచి 5 సార్లు వ్యాయామం చేసే మహిళలకు వెన్నునొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్నానం చేసేటప్పుడు వేడి నీళ్లను ఉపయోగించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాల నొప్పి తగ్గుతుంది.
వెన్నునొప్పితో బాధపడేవారు బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు పెరగడం వల్ల వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అధిక బరువుతో ఉంటే, వెంటనే బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
లేచి నిలబడినప్పుడు లేదా కూర్చున్నప్పుడు మీరు కుర్చున్న, నిలబడిన పొజిషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ముఖ్యంగా మీరు ఎక్కువ గంటలు కుర్చీలో కూర్చుని పని చేస్తే, దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
ఐస్ ప్యాక్‌లు వెన్నునొప్పి, బెణుకులు, వాపులను తగ్గిస్తాయి. దీన్ని అప్లై చేయడం వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.