AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjuna Benefits: ఆయుర్వేదంలో తెల్లమద్దికి విశిష్టత స్థానం.. గుండెకు బలాన్ని, ఎముకలకు శక్తిని ఇచ్చే శక్తి దీని సొంతం

Arjuna Benefits: ప్రకృతి మానవాళికి ఇచ్చిన అద్భుత వరం ఆయుర్వేదం..మానవ శరీరం ప్రకృతి నిర్మాణం.. అందుకనే సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలు తీసుకుంటే.. చాలావరకూ..

Arjuna Benefits: ఆయుర్వేదంలో తెల్లమద్దికి విశిష్టత స్థానం.. గుండెకు బలాన్ని, ఎముకలకు శక్తిని ఇచ్చే శక్తి దీని సొంతం
Arjuna Tree
Surya Kala
|

Updated on: Jun 27, 2021 | 7:22 AM

Share

Arjuna Benefits: ప్రకృతి మానవాళికి ఇచ్చిన అద్భుత వరం ఆయుర్వేదం..మానవ శరీరం ప్రకృతి నిర్మాణం.. అందుకనే సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలు తీసుకుంటే.. చాలావరకూ వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు అని పెద్దలు చెప్పారు. అనేక వ్యాధులను నయం చేసే శక్తి.. ఇంకా చెప్పాలంటే అనేక రోగాలు రాకుండా చేసే శక్తి.. పలు మొక్కలకు ఉంది. వాటిల్లో ఒకటి అర్జున వృక్షం.

దేశంలోని ప‌లు ప్రాంతాల్లో అర్జున వృక్షం బాగా పెరుగుతుంది. ఈ వృక్షాన్ని తెల్ల‌మ‌ద్ది అని కూడా పిలుస్తారు.అయితే ఎక్కువగా కలపగా ఉపయోగించే ఈ వృక్షాన్ని ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ వాడుతారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. అయితే ఈ వృక్షానికి గుండె జ‌బ్బులు, ఆస్త‌మా వంటి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంది. అంతేకాదు విరిగిన ఎముక‌ల‌ను కూడా త్వ‌ర‌గా అతుక్కునేలా చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ చెట్టు బెర‌డులో కాల్షియం, అల్యూమినియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. దీంతో ఆ బెరడు మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. తెల్లమద్ది చెట్టు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అర్జున చెట్టు బెరడుని పాలల్లో వేసుకుని కాచి ఆ పాలను రోజూ ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బును నివారిస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తుంది. గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది.

ఆస్తమా తో ఇబ్బంది పడేవారికి ఈ చెట్టు బెరడు మంచి ఔషధం. ఈ చెట్టు బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో 10 గ్రాముల మోతాదులో క‌లిపి తింటుంటే దాంతో శ్వాస కోశ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆస్తమా నివారింపబడుతుంది.

* అర్జున చెట్టు బెరడులో కాలిష్యం అధికంగా ఉంది. విరిగిన ఎముకలకు వైద్యంగా పనిచేస్తుంది. తెల్ల మద్ది చెట్టు బెరడు నుంచి తయారు చేసిన చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఆయుర్వేద మందుల్లో ఈ కాంబినేష‌న్‌ను ఎక్కువ‌గా వాడుతారు. ఈ మిశ్రమం ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కునేలా చేస్తుంది. అంతేకాదు, అవి బ‌లంగా కూడా మారుతాయి.

*ఈ చెట్టు బెర‌డు చూర్ణాన్ని తేనెలో క‌లిపి ముఖానికి రాసుకుంటే దాంతో మొటిమ‌లు త‌గ్గుతాయి.

*అర్జున చెట్టు బెరడు కషాయాన్ని తాగితే కాలిన గాయాలు, పుండ్లు త‌గ్గుతాయి.

*అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యం ఎక్కువగా ఉత్ప‌త్తి అవుతుంది.

*అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది.

Also Read: నేడు శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్రహ్మోత్సవాలు చివరి రోజు.. స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వహణ