Diabetic Heart Attack: డయాబెటిస్‌తో గుండెకు ముప్పు.. మధుమేహం నుంచి గుండెను ఎలా కాపాడుకోవాలి..?
Diabetic Heart Attack: ఆనారోగ్య బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉద్యోగంలో ఒత్తిడి, మానసికంగా ఒత్తిడికి గురవడం, ఆర్థిక ఇబ్బందులు, ప్రస్తుతం తినే ఆహారం..
Diabetic Heart Attack: ఆనారోగ్య బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉద్యోగంలో ఒత్తిడి, మానసికంగా ఒత్తిడికి గురవడం, ఆర్థిక ఇబ్బందులు, ప్రస్తుతం తినే ఆహారం తదితర కారణాల వల్ల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ ముఖ్యంగా మధుమేహం బారిన పడేవారి సంఖ్య చాలా పెరిగిపోతోంది. ఈ మధుమేహం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ డయాబెటిస్ వల్ల తలెత్తే గుండె సమస్యను డయాబెటిస్ హార్ట్ డిసీజ్ అంటారు. దీని వల్ల గుండెలోని కండరాలు గట్టి పడటం లేదా బలహీనపడటం జరుగుతుందని చెబుతున్నారు. దీనిని బయాబెటిక్ కాడియోమయోపతి అంటారు. ఎప్పుడైతే గుడెలోని కండరాలు పని చేయడం ఆగిపోతాయో అప్పుడు గుండెలో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఊరిపితిత్తుల్లోకి నీరు చేరుతుంది. కొందరికి గుండెకు రక్తం సరఫరా చేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహంతో బాధపడేవాళ్లలో కొంతమందికి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మధుమేహం ఉన్నవాళ్లు కొత్తగా ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల రక్తపోటు, అధిక బరువు సమస్యలు ఏర్పడతాయంటున్నారు. శరీరంలో మంచి కొవ్వు తగ్గి, చెడు కొవ్వు పెరిగిపోతూ ఉంటుందట. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లకు ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్, ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయడం ద్వారా గుండెకు సంబంధిత సమస్యలను గుర్తి్స్తారు. అందుకే డయాబెటిస్ ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
డయాబెటిస్ నుంచి గుండెను ఎలా కాపాడుకోవాలి..?
దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మధుమేహం ఉన్న వాళ్లలో యుక్త వయసులో కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడం, బీపీ, అధిక బరువు పెరుగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆహారం విషయంలో నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. పాలు, ఇతర తీపి పదార్థాలు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు. అంతేకాకుండా జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ప్రతి రోజు వాకింగ్ చేస్తుండాలని, ఇలా జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడమే కాకుండా గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు.