Protein Side Effects: ఆరోగ్యానికి మంచిదని ప్రోటీన్ అతిగా తీసుకుంటున్నారా.. కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుంది జాగ్రత్త!!

|

Sep 24, 2023 | 9:46 AM

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ అవసరం. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో ప్రోటీన్ కీలక పాత్ర వహిస్తుంది. అలాగే కణాజాలాల తయారీకి, శరీరం దృఢత్వంగా ఉంచేందుకు కూడా ప్రోటీన్ సహాయం చేస్తుంది. అయితే ప్రోటీన్ మంచిదని చాలా మంది అతిగా తీసేసుకుంటారు. కానీ దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న సంగతి తెలీదు. ఎదైనా సరే తక్కువైనా, మోతాదుకు మించి తీసుకున్నా శరీరం గ్రహించలేదు. ఎలాంటి వాటినైనా..

Protein Side Effects: ఆరోగ్యానికి మంచిదని ప్రోటీన్ అతిగా తీసుకుంటున్నారా.. కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుంది జాగ్రత్త!!
Protein
Follow us on

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ అవసరం. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో ప్రోటీన్ కీలక పాత్ర వహిస్తుంది. అలాగే కణాజాలాల తయారీకి, శరీరం దృఢత్వంగా ఉంచేందుకు కూడా ప్రోటీన్ సహాయం చేస్తుంది. అయితే ప్రోటీన్ మంచిదని చాలా మంది అతిగా తీసేసుకుంటారు. కానీ దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న సంగతి తెలీదు. ఎదైనా సరే తక్కువైనా, మోతాదుకు మించి తీసుకున్నా శరీరం గ్రహించలేదు. ఎలాంటి వాటినైనా మధ్యస్థంగానే తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో పలు దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హై ప్రోటీన్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు పెరుగుతారు:

ప్రోటీన్ తీసుకోవడం మంచిదే. అయితే శరీరానికి సరిపడా తీసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. లేదంటే నష్టాలే. ప్రోటీన్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతారు. హై ప్రోటీన్ ను ఫైబర్ జీర్ణం చేసుకోలేదు. ఫలితంగా ఇది కొవ్వుగా మారుతుంది. పొట్ట చుట్టూ, నడుము చుట్టూ కొవ్వుగా మారి పేరుకుపోతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మలబద్ధకం:

ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకంతో బాధ పడతారని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ లేకుండా ప్రోటీన్ ను తీసుకుంటే.. స్టూల్ మూమెంట్ సరిగ్గా ఉండదట. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకుంటే.. ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోవాలిని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్ర పిండాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది:

ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రోటీన్లను తయారు చేసే అమైనో యాసిడ్స్ లలో ఉండే నైట్రోజన్ కారణంగా ఇలా జరుగుతుందని పరిశోధనల్లో తేలింది.

క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది:

హై ప్రోటీన్ ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.

గుండెకు ముప్పు:

అధికంగా ప్రోటీన్ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఫ్యాట్ డైరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడ్ మీట్ వంటి వాటిల్లో కొవ్వులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలతో ఇబ్బంది పడతారని నిపుణులు అంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.