
సాధారణంగా ఏ మనిషికైనా మూడ్ స్వింగ్స్ ఉండటం కామన్ విషయం. అందులోనూ లేడీస్ కి అయితే చెప్పాల్ని పని లేదు. వారి మూడ్ మారుతూ ఉంటుంది. ఇంట్లో పనులు, ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఇలా రక రకాల కారణాల బట్టి మూడ్ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని సార్లు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఒక్కోసారి ఏమీ జరగకుండానే, మనకు తెలియకుండా బాధ, డీలా పడి పోతూ ఉంటారు. ఇలా మూడ్ స్వింగ్స్ ఉంటే చాలా కష్టం. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఏమీ చేయాలని అనిపించదు. ఇలా మనసు, బ్రెయిల్ లో ఉండే చికాకు, నిరాశ వంటివి పోవాలంటే.. దానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇలా మూడ్ ని చేంజ్ చేయడంలో కొన్ని రకాల పండ్లు కూడా హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మానసిక స్థితిని మార్చడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలను మెరుగు పరిచేందుకు సహాయ పడుతుంది. మీ మూడ్ బాలేనప్పుడు పైనాపిల్ తింటే సరిపోతుంది.
నిమ్మ కాయతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. దీర్ఘ కాలిక వ్యాధులకు సైతం అదుపు చేయవచ్చు. అలాగే మూడ్ ని మార్చడంలో కూడా నిమ్మ కాయ హెల్ప్ చేస్తుంది. నిమ్మ పండులో వాటెర్ కంటెంట్, విటమిన్లు అనేవి మెండుగా ఉంటాయి. మూడ్ బాలేనప్పుడు నిమ్మ రసం తీసుకున్నా కూడా సరి పోతుంది. మనిషిని యాక్టీవ్ చేస్తుంది.
అరటి పండులో ఎనర్జీ లెవల్స్ అనేవి మెండుగా ఉంటాయి. ఇది అన్ని కాలాల్లో విరివిగా దొరుకుతుంది. అంతే కాకుండా తక్కువ ధరలో లభ్యమవుతుంది. మీకు మూడ్ బాలేనప్పుడు.. అరటి పండును తింటే.. ఉపశమనం లభిస్తుంది. శరీరంలో హ్యాపీగా ఉంచే సెరోటోనిన్ అనే హార్మోన్లను విడుదల చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
అన్ని రకాల బెర్రీస్ లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి.. మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. బెర్రీల్లో ఉండే విటమిన్ సి.. హ్యాపీ హార్మోన్ అయిన డోపమైన్ ను విడుదల చేస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.