AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dry Fruits: మీరు ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి!!

డ్రైఫ్రూట్స్ ని ఇప్పుడు అందరూ తమ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. బలంగా, దృఢంగా ఉండాలంటే నట్స్ తినడం చాలా అవసరం. డ్రైఫ్రూట్స్ లో చాలా రకాలైన పోషకాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఇప్పుడున్న కాలుష్యం, మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. దీంతో వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కానీ డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా తిన్న..

Dry Fruits: మీరు ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి!!
Dry Fruits
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 25, 2023 | 9:58 PM

డ్రైఫ్రూట్స్ ని ఇప్పుడు అందరూ తమ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. బలంగా, దృఢంగా ఉండాలంటే నట్స్ తినడం చాలా అవసరం. డ్రైఫ్రూట్స్ లో చాలా రకాలైన పోషకాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఇప్పుడున్న కాలుష్యం, మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. దీంతో వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కానీ డ్రై ఫ్రూట్స్ ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా తిన్న ఫుడ్ అనేది బాగా జీర్ణం అవ్వాలి. లేదంటే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

తిన్న ఆహారాన్ని నిల్వ ఉంచకుండా జీర్ణం చేయడంలో డ్రై ఫ్రూట్స్ బాగా పని చేస్తాయి. కానీ చాలా మంది డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాడీలో కొవ్వు పెరిగిపోతుందని భావిస్తారు. అయితే ఏవైనా లిమిట్ గా తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే అవి పాయిజన్ లా మారి.. శరీరానికి నష్టాలనే మిగుల్చుతాయి. కాబట్టి మంచివే కదా అని డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. డ్రై ఫ్రూట్స్ తింటే బరువు కూడా తగ్గొచ్చు. అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్వాంటిటీ:

ఇవి కూడా చదవండి

కొంత మంది డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది కాదని తీసుకోరు. మరికొంత మంది మాత్రం డ్రై ఫ్రూట్స్ తింటే బలం అని మోతాదుకు మించి తీసేసుకుంటారు. కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా.. తక్కువగా కాకుండా తీసుకోవాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకునేవి, అందులోనూ నట్స్ లో పోషకాల విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రైట్స్ అన్నీ కలిపి ఒక గుప్పెడు ఉంటే సరిపోతుంది. ఒక వేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే వైద్యుని సలహాలు తీసుకోవడం బెటర్.

షుగర్ లేని డ్రై ఫ్రూట్స్ తినండి:

కొంతమంది ఏమైనా నట్సే కదా అని చక్కెర పూసిన డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుంటారు. ఇలాంటి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. నల్ల ద్రాక్షలో చక్కెర శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ మీరు వాటిని తీసుకోవాలనుకుంటే.. కాసేపు నీళ్లలో నానబెట్టి.. పిండి.. తీసుకోండి. ఇలా చేయడం వల్ల అందులోని చక్కెర శాతం తగ్గుతుంది.

నీరు ఎక్కువగా తాగాలి:

డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటే.. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాడీ డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది.

బ్యాలెన్స్ డైట్ తీసుకోండి:

కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాకుండా.. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు వాటిపై కూడా ఫోకస్ చేయాలి. దీని వల్ల ప్రోటీన్ కూడా అందుతాయి.

ప్రిజర్వేటీవ్స్ ఉన్న డ్రై ఫ్రైట్స్ తీసుకోకూడదు:

కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం సల్పర్ డయాక్సైడ్ వంటి ప్రిజర్వేటీవ్స్ ని ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. వీటి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.