Contraceptives: గర్భ నిరోధక ఔషధాలుగా యాంటీబాడీలు..సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నూరు శాతం ఫలితాలు!

KVD Varma

KVD Varma |

Updated on: Sep 06, 2021 | 8:36 PM

అమెరికన్ శాస్త్రవేత్తలు గర్భనిరోధక ఔషధాలుగా పనిచేసే ప్రతిరోధకాలను అభివృద్ధి చేశారు. ఇది గర్భధారణను నిరోధించడానికి హార్మోన్ కాని మార్గం.

Contraceptives: గర్భ నిరోధక ఔషధాలుగా యాంటీబాడీలు..సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నూరు శాతం ఫలితాలు!
Contraceptives

Follow us on

Contraceptives: అమెరికన్ శాస్త్రవేత్తలు గర్భనిరోధక ఔషధాలుగా పనిచేసే ప్రతిరోధకాలను అభివృద్ధి చేశారు. ఇది గర్భధారణను నిరోధించడానికి హార్మోన్ కాని మార్గం. అంటే, యాంటీబాడీల సహాయంతో, గర్భధారణను కూడా నిలిపివేయవచ్చు. అది మీ హార్మోన్లను ప్రభావితం చేయదు. యాంటీబాడీలను తయారుచేసే అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు, ఇది మహిళలకు కొత్త రకం గర్భనిరోధకం అని చెప్పారు. ఇది కూడా గర్భనిరోధక ఔషధాల దుష్ప్రభావాల నుండి వారిని కాపాడుతుందని తెలిపారు. ఈ పరిశోధన కోసం పరిశోధకులు గొర్రెలపై మొదటి విచారణ చేసారు. ఎందుకంటే, గొర్రెల పునరుత్పత్తి మార్గానికీ, మహిళల పునరుత్పత్తి మార్గానికీ చాలా పోలికలు ఉంటాయి. పరిశోధనల కోసం ఎంచుకున్న గొర్రెలకు అధిక మోతాదులో 333 µg యాంటీబాడీస్ ఇచ్చారు. దానిని ఇచ్చిన తరువాత, శరీరంలో ఉండే సహజ ప్రతిరోధకాలు.. కొత్త ప్రతిరోధకాలుగా పనిచేసి అండాన్ని చేరే ముందు అన్ని స్పెర్మ్‌లను నిలిపివేస్తాయి.

రెండవ పరిశోధనలో, పరిశోధకులు గొర్రెలకు తక్కువ మోతాదులో 33.3 మైక్రోగ్రాముల యాంటీబాడీస్ ఇచ్చారు. ఈ మోతాదు ఇవ్వడం ద్వారా, స్పెర్మ్‌ను ఆపడంలో 97 నుండి 99 శాతం విజయవంతం అయినట్టు పరిశోధకులు కనిపెట్టారు.

ప్రతిరోధకాలు గర్భధారణను ఎలా నిరోధిస్తాయి

సులభమైన భాషలో అర్థం చెప్పుకోవాలనే.. పురుషుడి స్పెర్మ్ స్త్రీ అండాన్ని కలిసిన తర్వాత మాత్రమే పిండం ఏర్పడుతుంది. శాస్త్రవేత్తలు సృష్టించిన శక్తివంతమైన యాంటీబాడీఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే, స్పెర్మ్‌ను అండాన్ని చేరుకోలేని విధంగా బలహీనపరుస్తుంది.

పరిశోధకులు, గర్భధారణను నిరోధించడానికి మొదటి ప్రయోగం గొర్రెలపై జరిగింది. ఇది విజయవంతమైంది. జంతువులలో, ఈ ప్రతిరోధకాలు స్పెర్మ్‌ను నిరోధించడంలో 99.9 శాతం వరకు విజయవంతమయ్యాయి.

గర్భనిరోధక ఔషధాలను తీసుకున్న తర్వాత, మహిళలు తలనొప్పి, బరువు పెరగడం, డిప్రెషన్, రక్తస్రావం వంటి అనేక దుష్ప్రభావాలకు గురికావలసి ఉంటుందని పరిశోధకుడు శామ్యూల్ లై చెప్పారు. అందుకే చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మానుకుంటారు. అటువంటి ప్రమాదాల నుండి రక్షించడానికి, కొత్త హార్మోన్ కాని గర్భనిరోధక ఎంపికలు అవసరం, వీటిని యాంటీబాడీల రూపంలో తయారు చేశారు.

Also Read: Nipah Virus: కేరళలో నిఫా వైరస్.. అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్..

Health Benefits: మీరు నానబెట్టిన బాదం తింటున్నారా.. అయితే ఈ సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిదే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu