Lotus Health Benefits: తామర పువ్వుల్ని ఇలా వాడితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

తామర పువ్వులు.. పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా పూజల్లో మాత్రమే ఉపయోగిస్తారు. తామర గింజల్ని అయితే ఆహార పరంగా యూజ్ చేస్తున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉంది. కానీ తామర పువ్వుతో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అనేక అనారోగ్య సమస్యల్ని నివారించు కోవడానికి తామర పువ్వులు.. దివ్యౌషధంగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు పుష్కలంగా..

Lotus Health Benefits: తామర పువ్వుల్ని ఇలా వాడితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Lotus Flower

Edited By:

Updated on: Dec 04, 2023 | 8:21 PM

తామర పువ్వులు.. పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా పూజల్లో మాత్రమే ఉపయోగిస్తారు. తామర గింజల్ని అయితే ఆహార పరంగా యూజ్ చేస్తున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉంది. కానీ తామర పువ్వుతో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అనేక అనారోగ్య సమస్యల్ని నివారించు కోవడానికి తామర పువ్వులు.. దివ్యౌషధంగా పని చేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

అలాగే మెగ్నీషియం, కాల్యిషయం, ఐరన్, ఫాస్పరస్, క్లోరిన్, పోటాషియం వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తామర పువ్వులను ఔషధంగా ఉపయోగిస్తారు. వీటితో చికాకు, తల నొప్పి, జ్వరం వంటి సాధారణ సమస్యలను కూడా తగ్గించు కోవచ్చు. తామర పువ్వులతో తయారు చేసే ఈ డ్రింక్ తాగితే అనేక రోగాలకు చెక్ పెడుతుంది. మరి అదేంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

లోటస్ ఫ్లవర్ డ్రింక్ తయారీ:

ఈ లోటస్ ఫ్లవర్ డ్రింక్ తయారు చేయడం చాలా సులభంగా. ముందుగా ఒక లోతైన పాత్ర తీసుకోవాలి. ఇందులో ఓ గ్లాస్ వాటర్ వేసి మరిగించు కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఈ నీటిలో తామర పువ్వులు వేసి ఓ రెండు గంటల పాటు ఉంచాలి. తర్వాత వీటిని ఫిల్డర్ చేసి తాగాలి.

ఇవి కూడా చదవండి

అనేక సమస్యలకు చెక్:

-ఇలా తయారు చేసిన తామర పువ్వుల డ్రింక్ తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జ్వరంగా ఉన్నప్పుడు తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది.

-గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదే విధంగా కిడ్నీలు కూడా హెల్దీగా ఉంటాయి.

-నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే వాళ్లు ఈ డ్రింక్ తాగడం వల్ల రక్త స్రావం కంట్రోల్ అవుతుంది.

-అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అధిక దాహాన్ని కూడా తగ్గిస్తుంది.

-తలనొప్పి, చికాకు ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

అయితే ఈ డ్రింక్ ను గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, హైపోగ్లైసీమియా ఉన్న వారు తీసుకోకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.