
బీర్ బాబులకు ఇది నిజంగానే మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. చల్లని బీర్ ఒకటి నోట్లో పడితే.. నరాలు జివ్వుమంటాయని.. స్వర్గ లోకపు అంచుల దాకా వెళ్లామని చెబుతూ ఉంటారు మందుబాబులు. చాలా మంది యువత ఇప్పుడు బీర్లు తాగడానికే మక్కువ చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చినా.. కాస్త సమయం దొరికినా.. లేక ఏమైనా సెలబ్రేషన్స్ వచ్చినా.. బీర్లు పొంగాల్సిందే. అయితే ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానికరమని.. మద్యాన్ని ఎక్కువగా తాగకూడదని చెబుతూంటారు. బీర్లు కూడా తాగొద్దని అంటూంటారు. దీంతో ఇంట్లో లేడీస్ కి భయపడి.. కాస్త దూరంగానే ఉంటారు బీర్ల ప్రియులు. అయితే మద్యం కంటే బీర్లలో ఉండే ఆల్కాహాల్ శాతం తక్కువగా ఉంటుందట. కాగా మెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ సంస్థ మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సర్వేలో తేలింది ఏంటంటే.. రోజూ బీర్ తాగితే మంచిదే అన్నట్లే వెల్లడించారు. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె పోటు సమస్యలు తక్కువ:
ఏకంగా ఏడు వేల మందికి పైగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుండె సమస్యలతో బాధ పడేవారు రోజూ ఓ గ్లాస్ బీర్ తాగితే చాలా మంచిదని వీరి అధ్యయనంలో తేలింది. అలాగే గుండె పోటు వచ్చే అవకాశాలు కూడా బీర్లు తగ్గిస్తాయట.
యాంటీ ఆక్సిడెంట్లు:
బీర్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని.. ఇవి తాగడం వల్ల అనే అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఈ అధ్యయనం తెలిపింది.
ప్రోటీన్లు ఉంటాయి:
బీర్లలో ప్రోటీన్స్, విటమిన్ బీ వంటివి కూడా ఉంటాయని తెలిపారు. వీటి వల్ల గుండె దడ, ఒత్తిడి, కంటి చూపు వంటి సమస్యలు రాకుండా చూస్తుందని తెలిపారు
ఎముకలు – దంతాలు బలంగా ఉంటాయి:
రోజూ ఒక గ్లాస్ బీర్ తాగడం వల్ల ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా ఉంటాయట. అలాగే నోటిలో క్యావిటీస్ రాకుండా కూడా చేస్తుందని చెప్పారు నిపుణులు. నోటిలో ఏమైనా చెడు బ్యాక్టీరియా ఉన్నా కూడా నశిస్తాయని వెల్లడించారు.
టైప్-2 డయాబెటీస్ వచ్చే అవకాశం తగ్గుతుంది:
బీర్ లో ఉండే గుణాలు టైప్-2 డయాబెటీస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందట. ఇదే కాదు ఇంకా స్కిన్, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందట.
అయితే ఇదే ఛాన్స్ కదా అని మందుబాబుటు ఇష్టమొచ్చినట్టు బీర్లు తాగకూడదు. ఏదైనా లిమిల్ లో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అదుపు తప్పితే అనారోగ్యమే. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి