నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం.. ఇంకా డబుల్ స్టామినా..

మిరియాలు.. భారతదేశంలోని దాదాపు ప్రతి వంటగదిలో కనిపించే ఒక మసాలా దినుసు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. అయితే, ఇది ఏ ఔషధం కంటే తక్కువ కాదని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే క్యాప్సైసిన్ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం.. ఇంకా డబుల్ స్టామినా..
Black Pepper
Follow us

|

Updated on: Sep 14, 2024 | 3:16 PM

మిరియాలు.. భారతదేశంలోని దాదాపు ప్రతి వంటగదిలో కనిపించే ఒక మసాలా దినుసు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. అయితే, ఇది ఏ ఔషధం కంటే తక్కువ కాదని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే క్యాప్సైసిన్ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఇది అనేక సమస్యలను దూరంచేసి.. శరీరాన్ని కాపాడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నల్ల మిరియాలు పొడి కొంచెం కలిపి తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

నల్ల మిరియాలు తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు..

మిరియాలు శక్తిని పెంచుతుంది:

ఎండుమిర్చిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే శారీరక దృఢత్వం పెరుగుతుంది. అలాగే శరీరంలో నీటి కొరత అదుపులో ఉంటుంది. ముఖ్యంగా పని చేసే పురుషులకు ఇది చాలా హెల్తీ డ్రింక్ అని చెబుతున్నారు.

కడుపు సమస్యలు దూరమవుతాయి:

కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ ఉంటే నిమ్మరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి కలుపుకుని తాగితే క్షణాల్లో నొప్పి తగ్గుతుంది.

టెన్షన్ ను దూరం చేస్తుంది:

నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా నల్ల మిరియాలు ఉద్రిక్తత, నిరాశను తొలగించడంలో ప్రజలకు సహాయపడతాయి.

చిగుళ్లు బలహీనంగా మారడాన్ని నిరోధిస్తుంది:

నల్ల మిరియాలు చిగుళ్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఎండుమిర్చి, మాయఫల (మజుఫాల్), రాళ్ల ఉప్పు సమపాళ్లలో కలిపి పౌడర్‌లా చేసి కొన్ని చుక్కల ఆవాలనూనె కలిపి దంతాలకు, చిగుళ్లకు పట్టించి అరగంట తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ దంతాలు, చిగుళ్ళలో నొప్పి సమస్య మాయమవుతాయి.

క్యాన్సర్ రాకుండా చేస్తుంది:

నల్ల మిరియాలు తినడం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల మిరియాలు విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జలుబు సమస్య దూరమవుతుంది:

జలుబులో మిరియాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి.. మిరియాలను వేడి పాలలో కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా తరచూ జలుబు చేస్తున్నా.. నిరంతరం తుమ్ములు వస్తున్నా.. మిరియాల పాలు తగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది:

మీకు డీహైడ్రేషన్ సమస్య ఉంటే, నల్ల మిరియాలు గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరతను నివారిస్తుంది. దీనివల్ల అలసట కూడా రాదు. దీనితో పాటు, చర్మం పొడిబారదు.

మిరియాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కావున, వీటిని అవసరమైనంత మేరకే తీసుకోవాలి.. ఏమైనా సందేహాలుంటే.. మీ వైద్య నిపుణులను సంప్రదించండి..

రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
తుంబాడ్ రీరిలీజ్‌లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
తుంబాడ్ రీరిలీజ్‌లో ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
ఐఏఎస్‌ల నుంచి ఐపీఎస్‌ల వరకు దర్శించుకునే గణనాథుడు..
ఐఏఎస్‌ల నుంచి ఐపీఎస్‌ల వరకు దర్శించుకునే గణనాథుడు..
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!