Post Meals Effects: మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే భోజనం చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు రావొచ్చు..

ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఆహారం కీలక పాత్ర పోషించినా మన ఆహార అలవాట్లు కూడా పాడు చేసే అవకాశం ఉంది. మనం తీసుకున్న ఆహారం కచ్చితంగా జీర్ణం అవ్వాలి కాబట్టి మెరుగైన జీర్ణక్రియను కాపాడుకోవడానికి కచ్చితం జీవనశైలిని నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post Meals Effects: మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే భోజనం చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు రావొచ్చు..
Digestion
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 14, 2023 | 7:16 PM

మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆరోగ్యం కూడా సహకరించాలి. మంచి ఆహారం తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ మెరుగై బలంగా ఉండడానికి సాయం చేస్తుంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఆహారం కీలక పాత్ర పోషించినా మన ఆహార అలవాట్లు కూడా పాడు చేసే అవకాశం ఉంది. మనం తీసుకున్న ఆహారం కచ్చితంగా జీర్ణం అవ్వాలి కాబట్టి మెరుగైన జీర్ణక్రియను కాపాడుకోవడానికి కచ్చితం జీవనశైలిని నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం..లేదా స్నానం చేయడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి మందులు లేకుండా జీర్ణక్రియను పెంచుకోడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 

భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం

ప్రతి పనికి నిర్దిష్ట కాలవ్యవధి ఉంటుంది. దానికి వ్యతిరేకంగా చేస్తే శరీరానికి హాని కలిగిస్తుంది. భోజనం చేసిన తర్వాత 2 గంటలలోపు స్నానం చేయకూడదు. ఎందుకంటే శరీరంలోని అగ్ని మూలకం ఆహార జీర్ణక్రియకు బాధ్యత వహిస్తుంది, కాబట్టి మీరు తిన్నప్పుడు, అగ్ని మూలకం సక్రియం అవుతుంది. అయితే సమర్థవంతమైన జీర్ణక్రియ కోసం రక్త ప్రసరణ పెరుగుతుంది. సో మీరు భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే, శరీర ఉష్ణోగ్రత తగ్గి ఆహారం నెమ్మదిగా జీర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. 

భోజనం చేసిన వెంటనే నడవడం 

ఎక్కువ దూరం నడవడం, ఈత కొట్టడం, వ్యాయామం చేయడం, ఈ కార్యకలాపాలన్నీ శరీరాన్ని చాలా అలసటకు గురి చేస్తాయి. తిన్న వెంటనే ఈ కార్యకలాపాలు చేయడం వల్ల జీర్ణక్రియకు హాని కలుగుతుంది. దీంతో పోషకాహారం అసంపూర్తిగా గ్రహించడం, ఉబ్బరం, భోజనం తర్వాత అసౌకర్య అనుభూతికి దారితీస్తుంది. అయితే భోజనం చేసిన తర్వాత ఓ పది నిమిషాలు తేలికగా నడిస్తే ఇబ్బంది ఉండదని, కానీ అదే పనిగా చేస్తే శరీరానికి హాని కలుగుతుంది. 

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం రెండు దాటాక భోజనం చేయడం

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, సూర్యుడు ఆకాశంలో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య ఎప్పుడైనా భోజనం చేయాలి. ఇది మీ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.  అయితే, మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

రాత్రిపూట పెరుగు తీసుకోవడం

సాధారణంగా పెరుగు తినడం జీర్ణక్రియకు చాలా సహాయం చేస్తుంది. కానీ రాత్రి భోజన సమయంలో లేదా రాత్రిపూట తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గు, మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో పెరుగు తీసుకోకూడదని సూచిస్తున్నారు. 

భోజనం చేసిన వెంటనే పడుకోవడం

చాలా మంది మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారు. భోజనానికి, నిద్రకు మధ్య 3 గంటల గ్యాప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట, ఊబకాయం వంటి సమస్యలు బాధపెడతాయి. కాబట్టి కచ్చితంగా భోజనం చేసిన వెంటనే పడుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..