మనం నిత్యం ఆరోగ్యంగా .. ఉత్సాహంగా ఉండటానికి పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక వీటిలో విటమిన్ల పాత్ర ప్రముఖమైనదని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుత కాలంలో మనం పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా శరీరానికి కావలసిన స్థాయిలో విటమిన్లు అందడం లేదు. ఫలితంగా శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడుతుంది. ఇలా జరగడం వల్ల మన శరీరం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన శరీరానికి ఉపయోగకరంగా ఉండే సీ, డీ, ఈ, బీ12 విటమిన్లలో ఏది లోపించిన అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందులో ముక్యంగా బీ12 విటమిన్ లోపం వలన అలసట, మతిమరుపు, కండరాలలో జలదరింపు, తిమ్మిర్లు, నాలుక రుచి కోల్పోవడం, కంటి చూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ సమస్యలు, చర్మం పాలిపోవడం.. వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే విటమిన్ బీ12 లోపం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, రక్తహీనత, అట్రోఫిక్ వలన కడుపులో పుండ్లు, క్రోన్స్ వ్యాధి, ఆల్కహాల్ ఎక్కువగా తాగలనిపించడం.. వంటి సమస్యల బారిన పడే ప్రమాదముంది. అందుకే శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని మనకు ఎక్కువగా ఆహారం నుంచే లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ.. చాలా మంది సహజ వనరులను తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు… కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ విటమిన్ బీ12 లోపాన్ని జయించవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని హెల్త్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..